గుణశేఖర్ దుష్యంతుడుగా ఆ మలయాళీ యంగ్ స్టార్

గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాభారతంలో దుర్ష్య ప్రేమకావ్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాడు.దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ గురించి భారతీయులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయినా దానిని కథల రూపంలో విని వారి అద్బుతమైన ప్రేమ గురించి చెప్పుకోవడమే తప్ప దృశ్య రూపంలో చూసింది లేదు.

 Dev Mohan As Dushyant In Gunasekhars Shaakuntalam-TeluguStop.com

మహాభారతం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చిన దుష్యంతుడు, శకుంతల కథని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఎవరూ చేయలేదు.అయితే గుణశేఖర్ కి ఈ కథ థీమ్ నచ్చడంతో ఏకంగా 50 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ హీరోయిన్ సమంతని నమ్ముకొని రంగంలోకి దిగుతున్నాడు.

ఇందులో టైటిల్ రోల్ ని సమంత చేస్తుంది.సమంత కెరియర్ లో కచ్చితంగా మరిచిపోలేని సినిమాగా శాకుంతలం మిగిలిపోతుంది.

 Dev Mohan As Dushyant In Gunasekhars Shaakuntalam-గుణశేఖర్ దుష్యంతుడుగా ఆ మలయాళీ యంగ్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఈషా రెబ్బని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు.అయితే దుష్యంతుడు పాత్ర కోసం ఇన్ని రోజులు చిత్ర యూనిట్ సస్పెన్స్ ని మెయింటేన్ చేసింది.అయితే దీంతో ఆ పాత్ర చేస్తుంది ఎవరనే చర్చ నడిచింది.సినిమాలో దుష్యంతుడు పాత్ర కీలకమైన మెజారిటీ భాగమా సమంతనే ఉంటుంది.ఆమె పాయింట్ అఫ్ వ్యూలోనే దర్శకుడు గుణశేఖర్ కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో దుష్యంతుడు పాత్ర కోసం కొత్త నటుడు కోసం అన్వేషించి ఫైనల్ గా మలయాళీ యంగ్ స్టార్ దేవ్ మోహన్ ని ఫైనల్ చేశారు.

ఇప్పటి వరకు మలయాళంలో ఒకే ఒక్క సినిమా చేసిన దేవ్ మోహన్ ని ఈ సినిమాలో దుష్యంతుడుగా గుణశేఖర్ తీసుకోవడం వెనుక కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

#Eesha Rebba #DevMohan #Gunasekhar #Gunasekhar's #Shaakuntalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు