రాఘవేంద్ర రావును కలిసిన దేత్తడి హారిక.. త్వరలోనే సినిమా?

యూట్యూబ్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేత్తడి హారిక ఒకరు.దేత్తడి అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హారిక ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Dettadi Harika Who Met Raghavendra Rao Raghavendra Rao, Dettadi Harika, Meet, So-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ప్రస్తుతం వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే యూట్యూబ్ వీడియో సాంగ్స్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.ఒకవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూనే మరో వైపు సినిమా అవకాశాలను అందు కుంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత ఈ బ్యూటీకి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం దక్కినట్టే దక్కి చేజారిపోయింది.

Telugu Biggboss, Dettadi Harika, Meet, Raghavendra Rao, Tollywood-Latest News -

ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్న హారిక తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ మిమ్మల్ని కలవడం విశేషం సార్ అంటూ రాసుకొచ్చారు.హారిక రాఘవేంద్ర రావుతో కలిసి దిగినటువంటి ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు దర్శకుడి పర్యవేక్షణలో హారిక ఏ సినిమాలోనైనా నటిస్తున్నారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగానే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సినిమా చేస్తున్నారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube