అమెరికాలో ఆ సీరియల్ హంతకుడు దొరికేశాడు..!!!

అమెరికాలోని డెట్రాయిట్ లో గత కొంతకాలంగా వరుసగా వేశ్యాలపై జరుగుతున్న అత్యాచార, హత్యలపై మిస్టరీ వీడింది.తాజాగా ఆ నరరూప హంతకుడిని డెట్రాయిట్ పోలీసులు పట్టుకున్నారు.

 Detroit Police Arrest Person Of Interest In Potential-TeluguStop.com

డెట్రాయిట్ లో పాడుబడిన ఇళ్లలో మహిళల శవాలు వరుసగా దొరకడంతో పోలీసులకి ఈ కేసు పెద్ద సవాలుగా మారింది.దాంతో ఎలాగైనా అతడిని పట్టుకోవాలని ఈ కేసుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

అమెరికాలో ఆ సీరియల్ హంతకుడు ద�

ఈ క్రమంలోనే డెట్రాయిట్ పోలీసులకి సీరియల్ కిల్లర్ దొరికేశాడు.అయితే మొదట్లో డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వలన మహిళలు చనిపోతున్నారని భావించారు పోలీసులు.కానీ, ఫొరెన్సిక్ నివేదికలో మాత్రం , హత్యలని తేలడంతో పోలీసులు షాక్ తిన్నారు.అసలు మహిళలు డ్రగ్స్ అధికంగా తీసుకుని మరణాలు పొందితే పాడుబడిన ఇళ్ళలోకి ఎందుకు వెళ్తారు అనే సందేహం వచ్చింది పోలీసులకి.

గత నెల మే లో పాడుబడిన భవనంలో నాన్సీ హ్యారిసన్ అనే మహిళ శవం మొదటిసారిగా గుర్తించారు పోలీసులు, ఆ తరువాత మరుసటి రోజు అదే ప్రాంతంలో మరో పాడుబడిన ఇంట్లో మరో మహిళ మృతదేహం దొరికింది.దీంతో పోలీసులకి అనుమానం కలిగింది.

సరిగ్గా మళ్ళీ అదే నెల 24 తేదీన మూడో మహిళ శవం మరొక పాడుబడిన ఇంట్లో దొరికింది.ఈ వరుస మర్డర్ లు పోలీసులకి తల నెప్పిగా మారడంతో విచారణ వేగవంతం చేశారు.

ఇక్కడ పోలీసులకి దొరికిన చిన్న క్లూ ఏమిటంటే చనిపోయిన వారందరూ వేశ్యలు, కావడం ,అది కూడా పాడుబటిన ఇళ్ళలో చనిపోవడంతో ఆదిశగా విచారణ చేపట్టారు.దాంతో హతకుడిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

అయితే ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు 1000 ఇళ్ళలో మరిన్ని సోదాలు జరపనున్నట్టుగా అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube