ముఖం ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.మచ్చలు లేదా బ్లాక్ స్పాట్స్ ఉంటే మాత్రం అందహీనులుగానే కనిపిస్తుంది.
దీంతో ఆ మచ్చలను తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు రాసేస్తుంటారు.అయినప్పటికీ మచ్చలు తగ్గకుంటే.
తీవ్రంగా చింతిస్తుంటారు.ఇక చివరకు చర్మ సౌందర్యాన్ని చెడగొట్టే ఈ మచ్చలను ఎలా నివారించుకోవాలో తెలియక హైరానా పడిపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ ఫేస్ మాస్క్‌లను ట్రై చేస్తే.ఖచ్చితంగా మచ్చల్లేని మెరిసి చర్మాన్ని పొందొచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ డిటాక్స్ ఫేస్ మాస్క్‌లు ఏంటో ఓ లుక్కేసేయండి.ఒక బౌల్‌లో వేపాకు పొడి, చిటికెడు పసుపు, ముల్తానీ మట్టి మరియు పాలు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై.ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం, చల్లటి నీటితో ముఖాన్ని, మెడను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మచ్చలతో పాటు మొటిమలు కూడా దూరం అవుతాయి.
రెండొవది.ఒక బౌల్‌లో కొద్దిగా ఎండబెట్టి పొడి చేసుకున్న మునగాకు పొడి, చిటికెడు, నిమ్మ రసం మరియు పెరుగు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా మూడు రోజులకు ఒకసారి చేయడం వల్ల.ముఖంపై మచ్చలు పోయి అందంగా మెరుస్తుంది.
మూడొవది.ఒక బౌల్‌లో గ్రంధం పొడి, చిటికెడు పసుపు మరియు స్వచ్ఛమైన తేనె వేసి మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేయడం వల్ల మచ్చల క్రమంగా తగ్గడంతో పాటు.
చర్మ ఛాయ కూడా పెరుగుతుంది.