చీరలో మెరిసిపోయిన దేత్తడి హారిక.. ఫోటో వైరల్..!

దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హారిక.అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకుని యూట్యూబ్ నే కెరీర్ గా ఎంచుకున్న హారిక యూట్యూబ్ ఛానల్ కు 16.5 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.తెలంగాణ యాసలో ప్రేక్షకులకు తన వీడియోల ద్వారా హారిక ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

 Dethadi Harika Saree Photos Goes Viral In Social Media,harikka,biggboss 4,abijit-TeluguStop.com

అయితే యూట్యూబ్ ఛానల్ కంటే బిగ్ బాస్ సీజన్ 4 లో పాలొనడం ద్వారా హారికకు మరింత గుర్తింపు వచ్చింది.

Telugu Dethadi Harika-Movie

బిగ్ బాస్ హౌస్ లో హారిక అభిజిత్ తో సన్నిహితంగా మెలగడంతో పాటు టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు.అభిజిత్ కు హారికకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ప్రచారం జరిగినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అభిజిత్ హారిక తాము అన్నాచెల్లెళ్లమని చెప్పుకొచ్చారు.అభిజిత్ హారిక బిగ్ బాస్ ఎందుకలా చూపించాడో తమకు తెలీదని వేర్వేరుగా ఇంటర్వ్యూల్లో పాల్గొని వెల్లడించారు.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.అయితే కెరీర్ కు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకే హారిక ప్రాధాన్యతనిస్తున్నారని సమాచారం.

మరోవైపు సంక్రాంతి పండుగ హారిక చీరలో మెరిసిపోయారు.భోగి, సంక్రాంతి పండుగల హారిక చీరలో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హారికకు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 కంటెస్టెంట్లకు పెద్దగా ప్లస్ కాకపోయినా బిగ్ బాస్ సీజన్ 3,సీజన్ 4 కంటెస్టెంట్లకు మాత్రం బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపుతో పాటు మంచి ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube