ఆ అబ్బాయితో నాలుగున్నరేళ్లు రిలేషన్ లో ఉన్నా: హారిక

దేత్తడి అనే యూట్యుబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ చక్కటి కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలేఖ్య హారిక.రెండు నెలల క్రితం వరకు యూట్యూబ్ ప్రేక్షకులకే సుపరిచితమైన హారిక బిగ్ బాస్ షోలో పాల్గొని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 Dethadi Harika Reveals Her Secret Love Story, Dethadi Harika ,love Story, Bigg B-TeluguStop.com

నటనపై ఉన్న ఇష్టంతో అమెజాన్ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకున్న హారిక నిన్నటి ఎపిసోడ్ లో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ తో సన్నిహితంగా ఉంటున్న హారిక నాలున్నరేళ్లు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానంటూ అవాక్కయ్యే విషయాన్ని వెల్లడించారు.

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు వాళ్ల ఆప్తుల నుంచి సందేశాలు వచ్చాయని.ఇంటి సభ్యులు కన్వెషన్ రూమ్ లో ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం చెబితే లేఖలను పంపిస్తామని అన్నారు.

హారిక తన లవ్ స్టోరీని అతిపెద్ద రహస్యం అని చెప్పింది.

Telugu Alekya Harika, Bigg Boss, Dethadi Harika, Dethadiharika, Ship, Love Story

రెండు సంవత్సరాల క్రితం వరకు తాను ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్నానని.డాడీకి, మమ్మీకి గొడవలు జరుగుతున్న సమయంలో ఒక అబ్బాయి తనపై ఎంతో ఇష్టాన్ని చూపాడని.తన కేరింగ్ చూసి తాను కూడా ఇష్టపడ్డానని.

అమ్మ దగ్గర తాను ఈ విషయాన్ని మాత్రం దాచానని హారిక అన్నారు.ఆరు సంవత్సరాల నుంచి ఈ విషయం తల్లికి చెప్పలనుకుంటున్నా చెప్పలేకపోయానని.

రెండేళ్ల క్రితం ప్రేమించిన అబ్బాయితో బ్రేకప్ అయిందని అన్నారు.

Telugu Alekya Harika, Bigg Boss, Dethadi Harika, Dethadiharika, Ship, Love Story

అమ్మ కొట్టడానికి, తిట్టడానికి కళ్ల ముందు లేకపోవడంతో ఈ సీక్రెట్ చెబుతున్నానని.మీ నమ్మకం బ్రేక్ అవుతుందనే ఒకే ఒక్క కారణం వల్ల ఆ విషయం ఇన్నిరోజుల నుంచి చెప్పలేదని హారిక తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube