బిగ్ బాస్ షో గురించి క్యాష్ లో మాట్లాడితే కట్ చేస్తాను?

బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి పలు సీరియల్స్ తో పాటు ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు ప్రసారం అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే పలు చానళ్లలో వివిధ రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూ వాటి మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో మనకు తెలిసిందే.

 Dethadi Harika Mentions Bigg-boss Show In-cash Show While Suma Alerts Her Bigg B-TeluguStop.com

అయితే ఓకే ఛానల్ లో ప్రసారమయ్యే షో గురించి మరొక ఛానల్లో మాట్లాడకూడదని నియమం కూడా ఉంటుందని మీకు తెలుసా?తెలియకపోతే సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అటువంటి క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే.ప్రతివారం ఈటీవీ లో క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతుంది.

ఈ క్రమంలోనే ఈ వారం క్యాష్ కార్యక్రమానికి గతంలో స్టార్ మాలో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో కి వెళ్ళిన కంటెస్టెంట్స్ జోర్దార్ సుజాత, దేత్తడి హారిక, మెహబూబ్‌, దర్శకుడు సూర్య కిరణ్ క్యాష్ కార్యక్రమానికి వచ్చారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు గేమ్ ఆడి గేమ్ స్టార్ట్ అనగానే వెంటనే దేత్తడి హారిక ఆ రెడీ అనగానే వెంటనే సుమ స్పందిస్తూ మీకు తెలుసు కదా .ఇది వేరే హౌస్ అది వేరే హౌస్.వీలైనంత వరకు ఈ హౌస్ లో ఆ హౌస్ గురించి చెప్పకుంటేనే బెటర్ లేకపోతే ఈ కార్యక్రమం ప్రసారం అయిన తర్వాత అయ్యో నేను మాట్లాడింది ఏమీ లేదే అంత ఎడిటింగ్లో పోయిందని బాధ పడాల్సి వస్తుంది అంటూ తెలియజేస్తుంది.

ఈ క్రమంలోనే వేరే ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల గురించి మరొక ఛానల్ లో మాట్లాడితే అంత ఎడిటింగ్ లో కట్ చేస్తారని సుమ పరోక్షంగా తెలియజేసింది.

Telugu Bigg Boss, Cash Show, Dethadi Harika, Etv Show, Jordar Sujatah, Mahaboob,

ఈ విధంగా వేరే ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల పేర్లు మాట్లాడకుండా ఉండొచ్చు గాని వేరే ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల గురించి ఈ ఛానల్లో పేరడీ చేయవచ్చు ఏమో.అందుకే సుమ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రశ్నలు మావి సమాధానాలు మీవి మా డబ్బులు మా దగ్గర ఉంటాయి మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి.మీలో ఎవరు క్యాషాధికారి అంటూ సుమ జెమినీ టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి స్పూఫ్ చేశారు.

ఏది ఏమైనా ఒక షో లో ప్రసారమయ్యే కార్యక్రమం గురించి మరొక షోలో ప్రస్తావించకూడదని ఈ సందర్భంగా సుమా తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube