ప్రపంచంలోని చౌకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం.. ధర ఎంతో తెలుసా..?

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలు అందించే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ డీటెల్ తాజాగా కొత్తగా ఎలక్ట్రానికి స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరతో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ను ఆవిష్కరించింది.

 Detel Launches Detel Easy Electric Bike In India , Subside, Electric Vehicle, De-TeluguStop.com

ఈ స్కూటర్ కు డీటెల్ ఈజీ అని నామకరణం చేసింది.కేవలం రూ.19,999 కు ఈ స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.

డీటెల్ సంస్థ ఈ స్కూటర్ లో అత్యాధునికతను జోడించింది.

స్కూటర్ లో 48 వాట్ల 12 ఏహెచ్ ఎల్ఐఎఫ్ఈపీఓ కలిగిన 4 బ్యాటరీలను అమర్చింది.దీనికి 7-8 గంటలకు చార్జ్ చేయాలి.

ఫుల్ చార్జింగ్ చేసినట్లయితే ఈ స్కూటర్ పై 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది.ఇందులో 6 పైప్ కంట్రోలర్ తో కూడిన 250 వాట్లను ఏర్పాటు చేశారు.

దీంతో బైక్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Telugu Air, Arvind Kejriwal, Delhi, Detel, Detellaunches, Cheapest Bike-Latest N

కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసినట్లు డీటెల్ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ యోగేష్ భాటియా పేర్కొన్నారు.పర్యావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకుని స్కూటర్ ను అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.భవిష్యత్ లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుందని అందుకే భారత్ లో ఈవీ పరిశ్రమలు వేగం పుంజుకుంటున్నాయని అన్నారు.

డీటెల్ ఈజీకి సంబంధించి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.అలాగే ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోంది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చారన్నారు.ఈ పాలసీతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నాడు.ఎలక్ట్రికల్ కార్లపై 1.5 లక్షలు, స్యూటర్, ఆటో రిక్షాల కొనుగోలుపై రూ.30,000 వరకు సబ్సిడీ పొందవచ్చని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube