అయోధ్య రామాలయానికి యూపీ సీఎం ఇచ్చిన విరాళాల వివరాలు..!!  

uttar pradesh,yogi adhityanath,ramnath kovinth,modi - Telugu Modi, Ramnath Kovinth, Uttar Pradesh, Yogi Adhityanath

ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్య రామాలయం నిర్మాణానికి గతంలో పునాది కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల కల నెరవేరిన సందర్భంలో ఈ రామాలయానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుండి రామాలయం నిర్మిస్తున్న ట్రస్ట్ కి భారీ స్థాయిలో విరాళాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ.5,00,100 విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రెండు లక్షల రూపాయల విరాళం అందించారు.ఈ విషయాన్ని స్వయంగా ఉత్తర ప్రదేశ్ సమాచార శాఖ విరాళాల వివరాలు వెల్లడించింది.ఇదే తరుణంలో ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు రామాలయ నిర్మాణానికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ డోలాకియా అయితే ఏకంగా 11 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.హీరోయిన్ ప్రణీత కూడా లక్ష రూపాయల విరాళం ప్రకటించింది.

 

#Modi #Uttar Pradesh #Ramnath Kovinth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు