సినిమా సినీ పరిశ్రమ ఎవరిని ఎలా మారుస్తుందో చెప్పడం కష్టం.స్టార్ హీరోల సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి.
చివరకు ఓ అనాథగా చనిపోవడం తమిళనాట సంచలనంగా మారింది.పోలీసులు ఆయన శవాన్ని అనాథ శవంలా తీసుకెళ్లడం దిగ్భ్రాంతి కలిగించింది.
ఆయన మరెవరో కాదు.దర్శకుడు త్యాగరాజన్.
అడయార్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న ఆయన.పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.పొన్ను పార్క పరేన్ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం ప్రభు హీరోగా వెట్రిమేల్ వెట్రి చిత్రాన్ని తెరకెక్కించాడు.అటు తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ తో మానగర కావల్ మూవీని తీశాడు.
మానగర కావల్ సినిమా 1991లో రిలీజ్ అయ్యింది.
అద్భుత విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను అప్పట్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం నిర్మించింది.
కానీ ఆయన అదే ఏవీఎం స్టూడియో దగ్గర్లో అనాథగా చనిపోయాడు.ఆయన మరణం ప్రస్తుతం తమిళ నాట సంచలనంగా మారింది.
వాస్తవానికి తన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది.కాని కొన్ని కారణాల మూలంగా ఆయనకు అవకాశాలు రాలేదు.
దాంతో వేరే సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశాడు.అనంతరం ఆయనకు అవి కూడా దొరకలేదు.
ఏం చేయాలో తెలియక తన సొంతూరుకు వెళ్లిపోయాడు త్యాగరాజన్.
అక్కడ తనకు యాక్సిడెంట్ అయ్యింది.కోమాలోకి వెళ్లిపోయాడు.కొద్ది కాలం తర్వాత కోలుకుని మళ్లీ చెన్నైకి వచ్చాడు.
ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు.ఏవీఎం స్టూడియో దగ్గర్లోనే పడుకునేవాడు.
అమ్మ క్యాంటీన్ లో భోజనం చేసేవాడు.అత్యంత దీన స్థితిలో జీవితాన్ని గడిపాడు తాజాగా ఆయన చనిపోయాడు.
పోలీసులు విషయం తెలుసుకుని ఓ అనాథ శవంగా భావించి ఆస్పత్రికి తీసుకెళ్ళారు.దర్శకుడిగా ఏవీఎం సంస్థ నిర్మించిన ప్రతిష్టాత్మక 150వ సినిమాకు దర్శకత్వం వహించిన త్యాగరాజన్.
అదే సంస్థ పక్కన అనాథ శవంగా మారడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.ఆయన మరణం పట్ల చాలా మంది కంటతడి పెడుతున్నారు.