500, 1000 పాత నోట్లు ఉంటే కాల్చేయండి ... లేదంటే జరిమానా     2016-12-26   22:49:47  IST  Bhanu C

పాత కరెన్సి పూర్తిగా చెత్త కాగితాలుగా మారడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నోట్లు మార్చుకోవడానికి భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31వ తేదితో ముగిసిపోనున్న సంగతి తెలిసిందే. మరి ఆ తరువాత కూడా మీ వద్ద పాత 500, 1000 నోట్లు ఉంటే వాటిని ఏం చేయాలి ? పాత క్యాష్ ఉంటే జ్ఞాపకంలా పడి ఉంటుందని దాచుకోకండి. నిర్దాక్షిణ్యంగా పాత నోట్లను చెత్త కాగితాలు అనుకోని కాల్చేయండి. లేదంటే జరిమానా తప్పదు.

అవును, జనవరి 1, 2017 తేదినుంచి ఎవరి దగ్గరైనా పాత కరెన్సి నోట్లు పది కన్నా ఎక్కువ కనబడితే 50,000 రూపాయల జరిమానా విధించే విషయం మీద భారత ప్రభుత్వం అలోచిస్తోందట. అయితే 50 వేలు, లేదంటే చేతిలో కనడిన మొత్తానికి ఐదింతలు జరిమానా విధించబడుతుందట.

ఈ జరిమానాని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ విషయంపై క్యాబినెట్‌ మీటింగ్ లో మంచి స్పందన లభిస్తే, పార్లమెంటరీ ద్వారా ఈ కొత్త జరిమానాని ఆర్డినెస్స్ రూపంలో తీసుకొస్తారట.

ఇదే జరిగితే, కరెన్సి బ్యాన్ విధించిన నవంబర్ 8వ తేది నుంచి లెక్కపెడితే, ప్రభుత్వం తీసుకొచ్చిన 61వ మార్పు అవుతుంది ఈ నిర్ణయం.