ఐపీఎల్ కు రిషబ్ పంత్ దూరమైనప్పటికీ ఢిల్లీ జట్టు అరుదైన గౌరవం.. ఏం చేసిందంటే..?

భారత స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్( Rishabh Pant ) రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఇంట్లో కోరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.చాలామంది క్రికెటర్లు రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి, మనోధైర్యం కల్పిస్తూ పరామర్శించారు.

 Despite Rishabh Pant S Absence From The Ipl, The Delhi Team Received A Rare Hono-TeluguStop.com

డిసెంబర్ 30న ఢిల్లీ – డెహ్రాడూన్ హైవేపై కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు.ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుండి ఇంటికి వచ్చేవరకు అన్నీ ఖర్చులను బీసీసీఐ పెట్టుకొని, అవసరమైన సహాయ సహకారాలను అందించింది.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక సురేష్ రైనా( Suresh Raina ), శ్రీకాంత్, హర్భజన్ సింగ్ లాంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు ఇంటికి వెళ్లి రిషబ్ పంత్ ను మానసికంగా దృఢంగా ఉండాలని, కొన్ని గంటలు అక్కడే ఉండి మనోధైర్యం నింపి పరామర్శించారు.త్వరలోనే ఇండియన్ క్రికెట్ లో పంత్ ఆట చూస్తామని తెలిపారు.

గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) కెప్టెన్ బాధ్యతలను ఈ ఏడాది డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు.ఈ ఏడాది పంత్ జట్టుకు దూరం అవడం చాలా బాధాకరమని ఢిల్లీ క్యాపిటల్స్ ఆవేదన వ్యక్తం చేసింది.పంత్ జట్టుకు దూరమైన కూడా అతనికి ఓ అరుదైన గౌరవం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది.

ఐపీఎల్ సీజన్ 16లో రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలోకి దిగనుంది.ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రకటించాడు.తాము రిషబ్ పంత్ ను ఈ సీజన్లో చాలా మిస్ అవబోతున్నాం.

ప్రమాదం కారణంగా క్రికెట్ ఆడ లేకపోయినా, ప్రతి మ్యాచ్ తన పక్కన కూర్చొని చూడాలని అనుకుంటున్నాట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఇక రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ షర్టులపై లేదా క్యాప్ లపై ఉంచాలి అని అనుకుంటున్నట్లు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube