దేవుని కోరిన కోరిక బయటికి చెప్పొద్దంటారు..కారణం ఏంటో తెలుసా?కోరిక బయటికి చెప్తే ఏం జరుగుతుందంటే.!

గుడికి వెళ్లినప్పుడు,ఇంట్లో పూజ చేసుకునేప్పుడు దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం.లేదంటే ప్రత్యేకంగా ఏదన్నా కోరిక కోరుకుని మొక్కుకుంటాం.

 Desires Before The God-TeluguStop.com

అయితే కోరిక కోరుకోగానే కొందరు బయటికి చెప్తుంటారు ,దేవున్ని ఫలానా కోరిక కోరుకున్న అని,కాని అలా బయటికి చెప్పొద్దు అని పెద్దవాళ్లు అంటుంటారు…కోరిక చిన్నదైనా ,పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదట.అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బైటికి చెప్పొద్దంటారు.

దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.అలా బైటికి చెప్తే ఏం జరుగుతుంది.

దేవుడిని పూజించి కోరే కోరిక.బలీయమైనది.కష్టమైనది.మన వల్ల కానిది అయి ఉంటుంది.

అలాంటి కోరిక తీరిందంటే.భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏంతో ఆనందించే విషయమే అవుతుంది.

అంత సుఖించే విషయం ధనం.సౌఖ్యం.మంచి భర్త.లేదా భార్య.పదవి ఏదైనా కావచ్చు.కోరిన కోర్కెను పైకి చెపితే విన్నవారు ఆనందంగా కనిపించినా.

లోలోన జరగకూడదని కోరుకోవచ్చు.పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికి మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు.

అలాంటి కోర్కె జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు.కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే.అదే విధంగా గుళ్లో ఏ విధంగా మసలుకోవాలో తెలుసుకోండి.

గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం, అరవడం, ఐహిక విషయాలు గురించి మాట్లాడటం చెయ్యకూడదు.

గుడి పరిశరాలను శుభ్రంగా ఉంచాలి, కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఎక్కడబడితే అక్కడ వెయ్యకూడదు.

దర్శనం లైన్ లో తోసుకోకూడదు.

దానివలన ఇతరులకుమనకు ఇబ్బందే.అందరూ మనతోపాటుగా దేవుడి దర్శనానికి వచ్చినవారే కాబట్టి అందరితోపాటుగా వెల్లడమే ఉత్తమం.

చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లగానే కళ్లుమూసుకుని దండం పెట్టుకుంటారు.కాని అలా చేయకూడదు.దేవుడిని ముందు తనివేతీరా చూడాలి.అంతేకాని కళ్ళుమూసుకుని ఉండకూడదు.

అంత దూరం వెళ్లింది దేవుడి దర్శనానికే కదా.అలాంటప్పుడు కళ్లు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది.

తీర్ధం నిలబడే తీసుకోవాలి.ఇంట్లో అయితే తీర్ధం కూర్చొని తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube