మత స్వేచ్ఛ.. భారత్‌కు సీపీసీ ట్యాగ్ ఇవ్వండి: అమెరికా సర్కార్‌కు ప్రవాసీ ముస్లిం సంఘం విజ్ఞప్తి

భారతదేశంలో ముస్లింలపై బీజేపీ ప్రభుత్వ అణచివేత ధోరణిపై అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రవాసీ సంస్థ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడేళ్లుగా ఇస్లామోఫోబియా పెరుగుతోందని సంస్థ ఆరోపించింది.

 Designate India As Cpc: Panellists At Congressional Briefing On Assam Urge Us Go-TeluguStop.com

మోడీ పాలనలో భారతీయ ముస్లింలు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారని మండిపడింది.ఇటీవల సెప్టెంబర్ 20న ఈశాన్య రాష్ట్రమైన అసోంలో దాదాపు 800 మంది బెంగాలీ మాట్లాడే ముస్లిం కుటుంబాల ఇళ్లను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐఏఎంసీ సంస్థ మరోసారి ముస్లింల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

అక్టోబర్ 6 న జరిగిన కాంగ్రెషనల్ బ్రీఫింగ్‌ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూఎస్ఏ, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సహా 17 మానవ హక్కుల సంఘాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక చర్యల నేపథ్యంలో భారతదేశాన్ని .అమెరికా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం (సీపీసీ)గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.మత స్వేచ్ఛా చట్టం ప్రకారం.మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించినందుకు దోషిగా వున్న దేశానికి సీపీసీ ట్యాగ్‌ను అమెరికా అధ్యక్షుడి అనుమతితో ఆ దేశ కార్యదర్శి జారీ చేస్తారు.

రాష్ట్ర కార్యదర్శి సీపీసీని నియమించినప్పుడు దానిని యూఎస్ కాంగ్రెస్‌కు తెలియజేస్తారు.మత స్వేచ్ఛ ఉల్లంఘనలను నిలిపివేయడానికి రూపొందించబడిన ఆర్ధికేతర విధాన ఎంపికల ద్వారా సీపీసీ ట్యాగ్ పొందిన దేశంపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తారు.

కాగా, యూనైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) 2020లో భారత్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని నాటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.సీఏఏ చట్టం వల్ల భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని యూఎస్‌సీఐఆర్ఎఫ్ 2020 ఏప్రిల్‌లో విడుదల చేసిన తమ వార్షిక నివేదికలో తెలిపింది.

అంతేకాకుండా భారత ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులకు చెందిన ఆస్తులను ఫ్రీజ్ చేసేలా ఆంక్షలు తీసుకొచ్చి వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ను కోరింది.అయితే నివేదికలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను యూఎస్‌సీఐఆర్ఎఫ్‌లోని ఇద్దరు కమిషనర్లు తప్పు పట్టడం విశేషం.

ఈ ప్రతిపాదనపై తొమ్మిది మంది కమిషనర్లలో గేరీ బాయిర్, తెన్‌జిన్ డోర్జీ అనే ఇద్దరు కమిషనర్లు అసమ్మతి వ్యక్తం చేశారు.చైనా, నార్త్ కొరియాల సరసన భారత్‌ను చేర్చడంపై వీరు తప్పుపట్టారు.

Telugu Congressional, Designateindia, Indianamerican-Telugu NRI

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో మతస్వేచ్ఛకు సంబంధించి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.యూఎస్‌సీఐఆర్ఎఫ్ తమ వార్షిక నివేదికలో ముఖ్యంగా ఎన్నార్సీ, సీఏఏల గురించి ప్రస్తావించింది.అంతేకాకుండా ఢిల్లీలో సీఏఏకు మద్దతుగా, వ్యతిరేకంగా జరిగిన దాడులను కూడా నివేదికలో తెలిపింది.వీటితో పాటు భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని కూడా ప్రస్తావించింది.

ఈ కారణంగానే భారత్‌ను ఆందోళనకర దేశాల జాబితాలోకి చేర్చాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.అయితే యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదికను భారత ప్రభుత్వం కూడా ఖండించింది.భారత్‌పై ఇచ్చిన నివేదికను సొంత కమిషనర్లే వ్యతిరేకించడాన్ని కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube