ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది.ప్రపంచం లో జరిగిన, జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ముందుంటాయి.
సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు తమకు సంబంధించిన వీడియోలను, ఎన్నో విషయాలను పంచుకుంటుంటారు.ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రెటీలు, సామాన్యులు కరోనా గురించి ప్రజలకు పలు జాగ్రత్తలు, సూచనలు తెలుపుతున్నారు.ఇక అన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పటికే కొంతవరకు వ్యాక్సిన్ ఇప్పించుకోగా మరికొంతమంది వ్యాక్సిన్ ఇప్పించుకోడానికి భయపడుతున్నారు.ఏదైనా ప్రమాదం జరుగుతాదేమోనని ముందుకు రావట్లేదు.
ఎంతో మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ కూడా తీసుకోగా ప్రజలకు వ్యాక్సిన్ కోసం సలహాలు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ హీరో బన్నీ వ్యాక్సిన్ వేయించుకోలేదని ఏకంగా ఓ హీరోయిన్ ని తిడుతున్నాడు.
అదేంటి బన్నీ తిట్టడం ఏంటి అనుకుంటున్నారా ఇది నిజం కాదండోయ్ ఇదంతా సోషల్ మీడియా మహిమ.ఈ సోషల్ మీడియా వచ్చినప్పటినుండి మీమ్స్, వీడియోలు ఇలా ఎన్నో రకాలు ఫన్నీగా క్రియేట్ అవుతున్నాయి.ఇక తాజాగా ఓ మీమర్స్ వ్యాక్సిన్ కోసం బన్నీ నటించిన దేశముదురు సినిమా లోని ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ ని వ్యాక్సిన్ కోసం ఫన్నీగా క్రియేట్ చేశారు.
బన్నీ వాయిస్ తో సరిపడా వాయిస్ ను డబ్బింగ్ చేస్తూ మంచి మీమ్స్ క్రియేట్ చేశారు.
ఇక అందులో హీరోయిన్ హన్సికను చూసి వ్యాక్సిన్ వేయించుకోవడానికి కదా నువ్వు వచ్చావు.వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ తిడుతున్న సన్నివేశాన్ని బాగా సెట్ చేసారు.అంతేకాకుండా ఓ రౌడీ కొట్టడానికి వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించురా ముట్టుకోకు అంటూ కొట్టినా సన్నివేశం కూడా బాగా ఫన్నీ గా అనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటి జనులు రక రకాల పోస్టులు పెడుతున్నారు.