ఇకపై ఆ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనా?

Desamuduru Heroine Hansika Good Bye To Tollywood , Hansika , Tollywood, Allu Arjun, Desamuduru , Hansika Marriage, Kollywood

దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక.మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు ను సొంతం చేసుకున్న హన్సిక ఆ తర్వాత తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

 Desamuduru Heroine Hansika Good Bye To Tollywood , Hansika , Tollywood, Allu A-TeluguStop.com

తెలుగు తో పాటు తమిళం మరియు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది.గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఈ అమ్మడు ఎక్కువగా సినిమాలు చేసింది.

లేడీ ఓరియంటెడ్ సినిమా లతో పాటు అనేక రకాల కమర్షియల్ పాత్రలను కూడా చేసింది.తమిళం లో ఈ అమ్మడు చేసిన సినిమాలు దాదాపు అన్ని తెలుగు లో డబ్బింగ్ అయ్యి ఆకట్టుకున్నాయి.

Telugu Allu Arjun, Desamuduru, Hansika, Kollywood, Telugu-Movie

ఇక ఈ అమ్మడు తెలుగులో నటించడం కష్టమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.తన చిరకాల ప్రియుడు సోహైల్ తో ఈ అమ్మడు ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలని భావిస్తుందట.కానీ ఇప్పటికే తెలుగులో పెద్దగా క్రేజ్‌ లేని హన్సిక ని పెళ్లి తర్వాత తెలుగు నిర్మాతలు పట్టించుకోరని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Allu Arjun, Desamuduru, Hansika, Kollywood, Telugu-Movie

సాధారణంగానే పెళ్లి అయిన హీరోయిన్స్ కి టాలీవుడ్ లో డిమాండ్ తక్కువ, అలాంటిది ఇప్పటికే డిమాండ్ తక్కువ అన్న హీరోయిన్.ఆపై పెళ్లయింది.కనుక తెలుగు లో ఆమె సినిమా లు రావడం కష్టమే అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.మొత్తానికి దేశ ముదురు ముద్దుగుమ్మ టాలీవుడ్ జర్నీ ముగిసినట్లే అనే అభిప్రాయం తో అభిమానులు ఉన్నారు.

తెలుగు లో సినిమా లు చేయకున్నా ఆమె ఇతర భాషల్లో చేసే సినిమా లు డబ్బింగ్ అవ్వడం తో ఆమె అభిమానులు ఆనందించే అవకాశాలు ఉన్నాయి.సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించే ఆసక్తి చూపిస్తుందట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube