జార్జ్‌ఫ్లాయిడ్ హత్య: జాత్యహంకార పోలీస్ అధికారి డెరిక్ చెవిన్‌కు 22 ఏళ్ల జైలు.. కోర్ట్ అంతిమ తీర్పు

యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయడంతో పాటు సమాజంలో వున్న జాతి, వర్ణ వివక్షలపై మరోసారి చర్చను లెవనెత్తిన నల్లజాతీయుడు ‘‘జార్జ్ ఫ్లాయిడ్’’ హత్య కేసులో శ్వేతజాతి పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు కోర్ట్ 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.చౌవిన్ సత్ప్రవర్తనతో ఉంటే గనుక 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్ మంజూరు చేయొచ్చ‌ని న్యాయస్థానం తెలిపింది.అయితే మార్గదర్శకాల్లో ఉన్నట్టు 12.5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష‌ విధించాలన్న ప్రాసిక్యూటర్ అభ్య‌ర్థ‌న మేర‌కు డెరిక్‌కు న్యాయ‌స్థానం 22.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.మరోవైపు తుది విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ ఫ్యామిలీకి నిందితుడు డెరిక్‌ సంతాపం తెలియ‌జేశాడు.కాలం మీకు మనశ్శాంతిని ఇవ్వాల‌ని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు.

 Derek Chauvin Sentenced To 22 Years And 6 Months In Prison For Killing George Fl-TeluguStop.com

అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.

ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Telugu America, Derek Chauin, George Floyd, Minneapolis, Minnesota-Telugu NRI

కాగా, జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపోలిస్ కోర్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్ 20న తుది తీర్పు వెలువరించింది.ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ, త్వరలోనే శిక్ష ఖరారు చేస్తామని తెలిపింది.న్యాయస్థానం తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలమని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ భావోద్వేగానికి గురయ్యారు.అటు ఫ్లాయిడ్ మద్ధతుదారులు కూడా రోడ్ల మీదకు వచ్చి ‘‘న్యాయం గెలిచిందంటూ’’ ఫ్లకార్డులు ప్రదర్శించారు.అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube