డేరా బాబాకు జీవిత ఖైదు ! జర్నలిస్ట్ హత్య కేసులో కోర్టు తీర్పు

అప్పట్లో సంచలనం సృష్టించిన డేరా బాబా ఆకృత్యాల వ్యవవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈయన మీద అనేక అభియోగాలు నమోదయ్యాయి.

 Dera Baba Gets Life Prison1-TeluguStop.com

అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న డేరా స్వచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ కు జీవిత ఖైదు విధిస్తూ పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ విచారణ జరిగింది.ఈరోజు కోర్టు రామ్ రహీమ్‌కు శిక్ష ఖరారు చేయనుండటంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న పంచకుల, సిర్సాలో 144 సెక్షన్ విధించారు.ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు.ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు.

ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube