జగన్ పరిపాలనపై నోరు జారిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి~  

జగన్ పరిపాలనపై నోరు జారిన పుష్ప శ్రీవాణి.

Deputy Cm Pushpa Sreevani Tongue Slip On Ysrcp Government-deputy Cm Pushpa Sreevani Tongue Slip,tdp,ysrcp Government

రాజకీయాలలో నాయకులు ఎవరైనా మాట్లాడితే కాస్త చూసుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఏమైనా తేడా వస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం మాట్లాడుతారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తడబడుతూ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు..

జగన్ పరిపాలనపై నోరు జారిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి~-Deputy CM Pushpa Sreevani Tongue Slip On YSRCP Government

చంద్రబాబు సైతం కొన్ని సందర్భాల్లో మాటల్లో తడబాటు కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా వైసిపి ప్రభుత్వంలో లో ఉప ముఖ్యమంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీ వాణి మీడియాతో మాట్లాడుతూ కాస్త తడబడ్డారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత మొదటి సారి సొంత జిల్లాకు వెళ్లిన ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పరిపాలన గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఒకటే లైన్ తో వెళ్తున్నారు అవినీతి పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం అని వాక్యలు చేసింది.

అయితే ఆమె పక్కనే ఉన్న అనుచరులు ఆమె చేసిన వాక్యాలను సరిచేయడంతో తప్పు తెలుసుకున్న డిప్యూటీ సీఎం వెంటనే సర్దుకున్నారు. అయితే అప్పటికే అది వీడియోలో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోని ఎవరు పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.