కొత్త జిల్లాలపై కూడా వైకాపా యూటర్న్‌?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ తాము అధికారంలోకి వస్తే పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని, పార్లమెంటు నియోజక వర్గంను ఒక జిల్లాగా ఏర్పాటు చేసి మొత్తం 25 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించాడు.జగన్‌ సీఎం అవ్వగానే కొత్త జిల్లాల విషయం తెరపైకి వచ్చింది.

 Deputy Cm Pilli Subhachandrabose Give The Clarity On Ap New Distict-TeluguStop.com

వైకాపా నాయకులు కూడా అదుగో ఇదుగో అంటూ వస్తున్నారు.ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకున్న జగన్‌ ఇప్పటి వరకు కొత్త జిల్లాల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కాని, కనీసం చర్చలు జరుపుతున్నట్లుగా కాని సమాచారం లేదు.

మొన్నటికి మొన్న వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26 నుండి కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తాయని, 25 మాత్రమే కాకుండా మరికొన్ని కూడా ఉంటాయంటూ వార్తలు వచ్చాయి.కాని అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది.

తాజాగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాచంద్రబోస్‌ మాట్లాడుతూ ప్రస్తుతంకు కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చలు ఏమీ జరగడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కష్టం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాంతో గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు డిప్యూటీ సీఎం ప్రకటనతో ఉసూరుమంటున్నారు.

గతంలో వైకాపా ఇచ్చిన ఈ హామీ విషయంలో యూటర్న్‌ తీసుకుంటుందా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube