ట్రంప్ బృందం నుంచీ మరో వికెట్ డౌన్..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన బృందంలో ఉన్న కీలక వ్యక్తులని ఒక్కొక్కరుగా జారవిడుచుకుంటున్నారు.తాజగా ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసిన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యప్తునకి ప్రత్యేక సలహాదారుగా ముల్లర్ నేతృత్వంలో విచారణ కమిషన్ ని నియమించిన అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్ రోజెన్‌స్టీన్‌ రాజీనామా చేశారు.

 Deputy Attorney General Rod Rosenstein Resigns-TeluguStop.com

అయితే ఆయన ముల్లర్ నివేదిక తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.మే 11వ తేదీ నుండీ తన రాజీనామా అమలులోకి వచ్చే విధంగా ఆ లేఖని ట్రంప్ కి పంపారు రోజెన్‌స్టీన్‌.

తన దేశానికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన అధ్యక్షుడు ట్రంప్ కి కృతజ్ఞతలు అంటూ ఆ లేఖలో తెలియచేశారు

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఆయన తన రాజీనామా లేఖలో ఎక్కడా కూడా ప్రత్యేక సలహాదారు ముల్లర్ ప్రస్తావన తీసుకురాక పోవడం గమనార్హం.రోజెన్‌స్టీన్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం రవాణా విభాగంలో ద్వితీయ శ్రేణి ఉన్నతాధికారిగా ఉన్న జెఫ్రీ రోజెన్‌ బాధ్యతలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube