పొగతాగితే 'డిప్రెషన్'లోకి వెళ్తారు.. మీకు తెలుసా?

మనం సాధారణంగా సినిమా థియేటర్లో, బహిరంగ ప్రదేశాలలో, లేదా మన ఇంట్లో టీవీలో ఏదైనా కార్యక్రమం మొదలయ్యేటప్పుడు ముందుగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటన ద్వారా అందరిని హెచ్చరిస్తుంటారు.మనం కేవలం అది చూస్తామంతే, కానీ ఎవరూ పాటించరు.

 Depression Smoking Scientists-TeluguStop.com

సిగరెట్ తాగడం ద్వారా ఎన్నో రకాల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.అంతేకాకుండా కొన్నిసార్లు క్యాన్సర్ కి కూడా కారణమవుతాయి.

ధూమపానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.కేవలం తాగే వారు మాత్రమే కాకుండా వారి పక్కనున్న వారికి ఆ పొగను పీల్చడం ద్వారా తాగేవారి కన్నా, ఆ పొగను పీల్చే వారిలో కూడా శ్వాసకోశ కు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి.

 Depression Smoking Scientists-పొగతాగితే డిప్రెషన్’లోకి వెళ్తారు.. మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా వారి ప్రాణానికి ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.అందుకే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు.

పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయన్న విషయం మనందరికీ తెలిసినదే, కానీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కి చెందిన పరిశోధకులు యూకే కి చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయో డేటా ను పరిశీలించిన తర్వాత, ఈ అధ్యయనంలో ఎంతో ఆశక్తికర ఫలితాలను వెల్లడించారు.ధూమపానం చేసేవారు కేవలం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా, డిప్రెషన్ లోకి వెళ్తారని, తాజాగా ఈ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తెలియజేశారు.

కేవలం డిప్రెషన్లోకి మాత్రమే కాకుండా, తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయనీ, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.ఇంత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే ధూమపానం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది.

కాబట్టి వీలైనంతవరకు ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా, మీ చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు.కాబట్టి వీలైనంతవరకు పొగ తాగడానికి దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం.

#Cinima Theaters #Research #Ungs #Revealed #Problems

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు