అమెరికాలో డిప్రెషన్ పై అవగాహనా సదస్సు..

అమెరికాలోని డాలస్ లో టీపాడ్ (తెలంగాణా ప్రజా సమితి) అధ్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహనా కార్యక్రమాన్ని ప్రతీ ఏటా మే నెలలో నిర్వహిస్తూ ఉంటారు.మే నేలని అవగాహనా మాసంగా తెలంగాణ పిలిచుకుంటారు.

 Depression Meeting In America-TeluguStop.com

ఈ పద్దతిని సుమారు 1949 నుండి పాటిస్తున్నారు.ఈ సంధర్భంగా టీపాడ్ యాంగ్జైటీ, డిప్రెషన్, మానేజ్మెంట్ అవేర్నెస్ పై డాలస్ లోని ప్లానోలోని , ఎస్.పి.ఆర్.బ్యాంకెట్ హాల్ లో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది.

ఈ సదస్సుకు వందల మంది పాల్గొన్నారు.

మానసిక ఒత్తిడి అనేది దాదాపు మనవ జీవన శైలిలో ఒక ముఖ్యమైన భాగం అయ్యిందని.దానిని జయించితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు తెలిపారు.

ఈ ఒత్తిడి ముఖ్యంగా యువతీ యువకులని పట్టి పీడిస్తోంది.టీనేజీలో ఉన్న పిల్లలు, తల్లి తండ్రులు, ఇలా చాలా మంది ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అని ఆలోచనతో తికమక పడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే వారికి సరైన దారి దొరకక కుంగిపోతూ ఉంటారు.

అమెరికాలో డిప్రెషన్ పై అవగాహ�

అందువల్ల ఇలాంటి పరిణామాల నుంచీ సత్వర నివారణచర్యలు చేపట్టే విధంగా టీపాడ్ ఈ అవగాహనా సదస్సు నిర్వహిస్తోంది.డాలస్ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాతి పొందిన, మానసిక నిపుణులు డాక్టర్ పవన్ పామదుర్తి చొరవతో “యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్‌మెంట్” పై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుందని వచ్చిన తెలుగు వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సమాజంలో ఎదుర్కుంటున్న విషయాలకి సరైన మార్గం దొరికిందని మాకు ఎంతో ఉపయోగ పడిందని టీపాడ్ ని అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube