డిప్రెషన్ లోకి ఈజీగా వెళ్లే రాశులు

సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో నిరాశ,నిస్పృహలకు గురి కావాల్సిందే.అయితే నిరాశకు గురి కావటానికి ఒక్కో మనిషికి ఒక్కో కారణం ఉంటుంది.

 Depression In Astrology-TeluguStop.com

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు డిప్రెషన్ కి గురి అవుతారు.అయితే ఏ రాశుల వారు డిప్రెషన్ కి లోను అవుతారో ఒక్క సారి చూద్దాం.

మకర రాశి
ఈ రాశివారికి ఇతరుల కన్నా తామే ముందు ఉండాలనే తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ రాశి వారు ఒక్కోసారి ఎంత కష్టపడినా వారు అనుకున్నది సాధించటంలో విఫలం అవుతూ ఉంటారు.

వీరు సామర్ధ్యానికి మించి పనిచేసిన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంతో సఫలం కారు.ఈ కారణాలతో మకర రాశి వారు డిప్రెషన్ కి లోను అవుతూ ఉంటారు.

వృషభ రాశి
ఈ రాశి వారు వాస్తవాన్ని గ్రహించి జీవితాన్ని గడపాలి.వీరు ఊహల్లో బ్రతికితే ఇబ్బందులు తప్పవు.కలల్లో విహరిస్తూ ఉండటం వలన వాస్తవంలో అలా జరగకపోయేసరికి ఇబ్బందులకు గురవుతారు.దాంతో చాలా సులభంగా వృషభరాశి వారు డిప్రెషన్ లోకి వెళ్తారు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిలోనే బాధ పడతారు.దాంతో డిప్రెషన్ కి లోను అవుతారు.

మీన రాశి
ఈ రాశివారు ప్రతి చిన్న విషయానికి తొందరగా బాదలోకి వెళ్ళిపోతారు.

అయితే వారికి తాము ఎందుకు బాధపడుతున్నామో కూడా తొందరగా అర్ధం కాదు.వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా తొందరగా డిప్రెషన్ కి లోను అవుతూ ఉంటారు.

కర్కాటక రాశి
వీరు ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించటం వలన పిరికితనంతో ఉంటారు.అలాగే వీరు తమ గురించి ఎదుటి వారు ఏమి అనుకుంటున్నారో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube