కుటుంబ సభ్యులు తన పెళ్లి విషయం పట్టించుకోవడం లేదని అతను చేసిన పని చూస్తే  

Depression Drives Hyderabad Man To Commit Suicide-

కొందరు ఆత్మహత్య చేసుకుంటే చాలా పెద్ద కారణాలు ఉంటాయి.అప్పుడు అయ్యో అనిపిస్తుంది.కాని కొందు మాత్రం చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకుంటే వారి కారణం విని ఛీ ఇంత చిన్న కారణంకు ఆత్మహత్య చేసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు...

Depression Drives Hyderabad Man To Commit Suicide--Depression Drives Hyderabad Man To Commit Suicide-

ఆత్మహత్య అనేది కొన్ని నిమిషాల్లో తీసుకునే పెద్ద నిర్ణయం.ఆ నిర్ణయం అనేది జీవితంను నాశనం చేసేది అనే విషయాన్ని చాలా మంది గుర్తించరు.అలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించాలనే ఇంగితజ్ఞానం కనీసం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒ కుర్రాడు పెళ్లి కావడం లేదు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడని స్నేహితులు అంతా భావిస్తున్న సమయంలో అతడు ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారింది.కుటుంబ సభ్యుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వెళ్లడించాడు.

Depression Drives Hyderabad Man To Commit Suicide--Depression Drives Hyderabad Man To Commit Suicide-

దాంతో అంతా కూడా అవాక్కయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎంఎస్‌ మక్తాకు చెందిన షేక్‌ హైదర్‌కు ఆరుగురు సంతానం.4వ కొడుకు షేక్‌ సాబేర్‌ కు మినహా మిగిలిన అయిదుగురికి పెళ్లిలు అయ్యాయి.ఇటీవలే షేక్‌ హైదర్‌ చనిపోయాడు.దాంతో సాబేర్‌ పెళ్లి విషయం పట్టించుకునే వారే కరువయ్యారు.

తన అన్నలు ఎవరు కూడా తన పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని సాబేర్‌ బాధపడుతూ ఉండేవాడట.ఇన తనకు పెళ్లి అయ్యే అవకాశం లేదని భావించిన సాబేర్‌ తాజాగా నక్లెస్‌ రోడ్డులోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు వస్తున్న సమయంలో రైలు కింద తల పెట్టాడు.దాంతో అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు...

స్టేషన్‌లో ఉన్న వారు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.క్షణికావేశంలో అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.