హోంలాండ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద 'స్వస్తిక్' కలకలం

అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ కేంద్ర కార్యాలయం వద్ద నాజీ స్వస్తిక్ గుర్తు కలకలం రేపింది.రాజధాని వాషింగ్టన్‌లోని నెబ్రాస్క్ అవెన్యూ కాంప్లెక్స్‌లోని మూడవ అంతస్థులో ఉన్న హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యాలయం గోడలపై శుక్రవారం చేతితో గీయబడిన నాజీ స్వస్తిక్ గుర్తు కనిపించింది.

 Department Of Homeland Security Building-TeluguStop.com

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అధికారులు.ఇటువంటి నిషేధిత చిహ్నాలకు కార్యాలయంలో స్థానం లేదన్నారు.

Telugu Swastika, Telugu Nri Ups-

  ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న యూఎస్ ఇంటెలిజెన్స్ అధినేత గ్లేవ్‌తో చర్చించినట్లు ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ అధికారులు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వస్తిక్‌ను తొలగించి దర్యాప్తు చేస్తున్నారు.అక్కడి హౌస్ కీపింగ్ సిబ్బందిని అధికారులు దీనిపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Telugu Swastika, Telugu Nri Ups-

  కాగా.కొద్దిరోజుల క్రితం స్వస్తిక్ ముద్రను నిషేధిస్తూ జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది.జర్మనీ నియంత హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీ గుర్తుగా స్వస్తిక్ బాగా గుర్తింపు పొందింది.

అయితే ఈ చిహ్నాన్ని అమెరికా తదితర దేశాల్లో దుర్మార్గానికి ప్రతీకగా భావిస్తారు.ఆ గుర్తు వల్ల కొందరు విద్యార్ధుల మనోభావాలు దెబ్బతింటాయని వర్సిటీ అధికారులు అప్పట్లో వాదించారు.

ఇప్పుడు ఏకంగా అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ కార్యాలయంపై నాజీ గుర్తు కనిపించడం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు.దీనిని గీసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్ విభాగం ప్రయత్నిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube