రియా బయటకు వెళ్తే ప్రమాదం… అందుకే నో బెయిల్ అన్న కోర్టు  

Denying bail to actor Rhea Chakraborty, Sushant Singh Rajput Suicide, Rhea chakraborty, Mumbai High Court, NCB, Drugs Mafia, Bollywood - Telugu Bollywood, Denying Bail To Actor Rhea Chakraborty, Drugs Mafia, Mumbai High Court, Ncb, Rhea Chakraborty, Sushant Singh Rajput Suicide

సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐ విచారణ చేస్తే బాలీవుడ్ లో డ్రగ్స్ లింకులు బయట పడ్డాయి.దీంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి ఈ డ్రగ్స్ భాగోతాలు బయటకి లాగేందుకు సిద్ధం అయ్యారు.

TeluguStop.com - Denying Bail To Actor Rhea Chakraborty

అందులో భాగంగా డ్రగ్స్ సప్లయర్స్ తో లింకులు ఉన్నాయని ఆధారాలు రుజువు కావడంతో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడుని ఇప్పటికే అరెస్ట్ చేశారు.ఆమె ద్వారా బాలీవుడ్ ఎంత మంది డ్రగ్స్ వాడుతున్నారు, డ్రగ్స్ ఎలా సప్లయ్ అవుతుంది అనే విషయాలని బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ ప్రాధమిక దశలోనే ఉండగా తనకి బెయిల్ మంజూరు చేయాలని రియా తన లాయర్ ద్వారా బోంబే హైకోర్టులో పిటీషన్ వేశారు.అయితే ఈ బెయిల్ పిటీషన్ విచారించిన న్యాయస్థానం దానిని కొట్టేసింది.

TeluguStop.com - రియా బయటకు వెళ్తే ప్రమాదం… అందుకే నో బెయిల్ అన్న కోర్టు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో ఆమెకి బెయిల్ ఇవ్వకపోవడానికి కారణాలు ఇవే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రియా ఇప్పుడు డ్రగ్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకొని ఉందని బెయిల్ మీద రియాను విడుదల చేస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఆమె ఎవరి పేర్లను వెల్లడించిందో వారందరినీ అలర్ట్ చేస్తుందని కోర్టు తెలిపింది.

సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో రియా కొందరి పేర్లను బయట పెట్టిందని తెలిపింది.రియా బయటపెట్టిన వారిని విచారించే పని మొదలైందని, ఈ నేపథ్యంలో రియా విడుదలైతే, వారిని ముందుగానే అలెర్ట్ చేసి సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్లాన్ చేస్తారని చెప్పింది.సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఈ పరిణామాల నేపథ్యంలో నిందితురాలికి తాను బెయిల్ ఇవ్వలేనని జడ్జి స్పష్టం చేశారు.

దీంతో ఆమె బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న పిటీషన్ కి నిరాశ ఎదురైంది.ఆమె తరుపు న్యాయవాది వాదించి రియాకి బెయిల్ ఇవ్వడం సమంజసమే అని చెప్పిన కూడా జడ్జ్ దానికి అంగీకరించలేదు.

#SushantSingh #Drugs Mafia #DenyingBail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Denying Bail To Actor Rhea Chakraborty Related Telugu News,Photos/Pics,Images..