కరోనా ఎఫెక్ట్: మరోసారి వాయిదా పడ్డ ప్రధాని పెళ్లి!

కరోనా సామాన్యుల నుంచి దేశాధినేతలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.లాక్ డౌన్ తో అనుకున్న ఏ పనులు కూడా అవ్వకపోవడం తో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.

 Denmark Pm Wedding Postponed One More Time, Denmark, Denmark Pm, Wedding, Corona-TeluguStop.com

ఈ క్రమంలోనే డెన్మార్క్ ప్రధాని కి కూడా చిక్కులు వచ్చి పడ్డాయి.మొన్నటి వరకు కరోనాతో లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడగా.

తీరా పెళ్లికి సిద్ధమౌతున్న సమయంలో యూరోపియన్ యూనియన్ సమ్మిట్ రూపంలో మరోసారి బ్రేక్ పడింది.దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.గతంలో కూడా వేరే కారణాల రీత్యా వీరి పెళ్లి ఒకసారి వాయిదా పడగా,ఇటీవల కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి వారి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా బ్రసెల్స్ లో సమ్మిట్ ఉందంటూ సమాచారం అందింది.దీనితో మరోసారి వారి పెళ్లి వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

శనివారం వారి పెళ్లి కి సంబందించిన అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఈ సమ్మిట్ సమాచారం అందడం తో పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తన కాబోయే భర్త ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.

ఈ విషయాన్ని వెల్లడించింది.‘ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లాడేందుకు నేను ఎంతో వేచి చూస్తున్నాను.

ఎదురుచూపులు చూస్తూ ఉండటం అంత సులువు కాదు.మేము వివాహం చేసుకోవాలనుకున్నా వాయిదా పడింది.

డెన్మార్క్ ప్రజల ప్రయోజనాల కోసం సక్రమంగా విధులు నిర్వర్తించాలని భావించి పెళ్లి వాయిదా వేసుకున్నా అంటూ ఆమె తన పోస్ట్ లో వెల్లడించారు.అయితే మరోపక్క తమ ప్రధాని పెళ్లికి ఇన్ని ఆటంకాలు రావడంపై అక్కడి ప్రజలు ఆసక్తిగా చర్చించుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube