కరోనా రోగులకు మరో టెన్షన్.... బాధితుల్లో ఆ వ్యాధుల లక్షణాలు?

భారతదేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది.దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

 Dengue And Malaria Symptoms Found In Corona Patients, Corona Patients, Delhi, Ne-TeluguStop.com

కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 41,13,812కు చేరగా మృతుల సంఖ్య 70,626కు చేరింది.భారత్ లో ప్రస్తుతం 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా వైద్యుల పరిశోధనలో కరోనా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ వైద్యులు తాజాగా కరోనాతో బాధ పడుతున్న వాళ్లు మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల బారిన కూడా పడుతున్నారని తేల్చారు.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారికి పరీక్షలు నిర్వహిస్తే చాలామంది డెంగ్యూ లేదా మలేరియా వ్యాధులలో ఏదో ఒక వ్యాధి బారిన పడినట్టు గుర్తించామని తెలిపారు.ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య మాట్లాడుతూ ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని అన్నారు.

కరోనా సోకిన వారందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని అయితే డెంగ్యూ లేదా మలేరియా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిదని తెలిపారు.ఒకే రోగిలో రెండు వేరువేరు వ్యాధులు కనిపిస్తే వారికి చికిత్స చేయడం కష్టమవుతుందని తెలిపారు.

ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించే సీజన్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా కరోనా రోగుల్లో డెంగ్యూ, మలేరియా లక్షణాలు కనిపిస్తున్నాయని వెలుగులోకి వస్తున్న వార్తలు కరోనా రోగులను మరింత భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube