ట్రంప్‌కు శిక్ష రెడీ: అధ్యక్షుడిగా పీకేయడమే కాదు.. మళ్లీ పోటీ చేయకుండా..?

క్యాపిటల్ భవనంలోకి మద్ధతుదారులను ఉసిగొల్పడంతో ట్రంప్‌పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఆయనను గడువుకు ముందే పదవిలోంచి తొలగించేందుకు వున్న సాధ్యాసాధ్యాలపై రిపబ్లికన్లు, డెమొక్రాట్లు పరిశీలిస్తున్నారు.

 Democrats Plan To Introduce Article Of Impeachment For Donald Trump, In The Capi-TeluguStop.com

ఇప్పటి వరకు ట్రంప్ చేసిన అన్నింటికి కలిపి శిక్ష భారీగానే ప్లాన్ చేస్తున్నారు.దీనిలో భాగంగా అధ్యక్షుడిగా తొలగించడంతో పాటు మళ్లీ జీవితంలో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా డెమొక్రాట్లు ఓ తీర్మానాన్ని రెడీ చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి.మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం.దేశ ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు.ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

రెండోది అభిశంసన.అధ్యక్షుడిని తొలగించాలంటూ మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానాన్ని, సెనేట్‌ కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

Telugu Biden, Democrats, Capitol, Presidency, Republicans, Trump-Telugu NRI

అయితే ఈ ప్రక్రియకు సమయం ఎక్కువ పట్టే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.అందువల్ల మధ్యేమార్గంగా శాశ్వతంగా ట్రంప్ పోటీ చేయకుండా చేయాలని చూస్తున్నారు.ఈ విధానంలో ట్రంప్ అధికారంలో వున్నప్పుడు అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టి.బెైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిని కొనసాగించవచ్చని అమెరికా చరిత్ర చెబుతోంది.1876లో నాటి అధ్యక్షుడు యులిసిస్ దగ్గర పనిచేసిన రక్షణ, యుద్ధ వ్యవహారాల కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేసినా, అభిశంసన తీర్మానం నడిచింది.

అలా ప్రస్తుతానికి ట్రంప్‌ను విడిచిపెట్టినా… భవిష్యత్‌లో అధ్యక్ష పదవితో పాటు మరే ఇతర పదవికి అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube