రాజీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంకు పట్టు ఈ సారి చెల్లలేదు మెక్సికో సరిహద్దు గోడ విషయంలో తానూ కోరిన

 Democrats Oppose Trump Decision About American Border Wall-TeluguStop.com

500 కోట్ల డాలర్ల ఫెడరల్‌ నిధులను విడుదల చేయాలనే ట్రంప్ కోరికని డెమోక్రాట్లు తిరస్కరించారు.దాంతో ట్రంప్

ప్రభుత్వాన్ని షట్‌డౌన్‌ చేస్తామని బెదిరించాడు.

అయితే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ తాజాగా ఈ అంశంపై దిగొచ్చాడు.

మంగళవారం చివరి రోజున ప్రభుత్వం ఎలాంటి షట్‌డౌన్‌కు వెళ్లరాదని ప్రభుత్వం భావించిందని ఆమె మీడియాకి తెలిపారు.మెక్సికోతో సరిహద్దును మూసివేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వ ఎట్టి పరిస్థితుల్లో షట్‌డౌన్‌ కాదని ప్రెస్‌ సెక్రటరీ వెల్లడించారు.సరిహద్దు భద్రతపై ట్రంప్‌ ప్రభుత్వం 500 కోట్ల డాలర్లు కావాలని ప్రతిపాదించగా, డెమొక్రాట్ల ప్రాబల్యం గల ప్రతినిధుల సభ 106 కోట్ల డాలర్లు మాత్రమే మంజూరు చేస్తామని చెప్పింది.

అయితే సరిహద్దు గోడ లేకుండానే భద్రతను పరిరక్షించవచ్చని అమెరికన్‌ కాంగ్రెస్‌ తేల్చి చెప్పింది.ఇదిలాఉంటే అమెరికన్‌ రాజకీయ భాషలో “ప్రభుత్వ షట్‌ డౌన్‌” అంటే అర్థం ఫెడరల్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దును అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించడానికి తిరస్కరించినప్పుడు ఫెడరల్‌ ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కొన్నిటిని నిలిపేయడమే అంటూ అభివర్ణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube