అమెరికాలో మాస్కుల రాజకీయం.. భారత్‌ను ఎత్తిచూపుతూ బైడెన్ సర్కార్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం

కరోనా వైరస్ కారణంగా అనేక దేశాలు తల్లడిల్లుతున్న సంగతి తెలిసిందే.ఏకంగా దేశాధినేతల పీఠాలను కదిలించే స్థాయికి ఈ మహమ్మారి చేరుకుంది.

 Democrats Forcing Vaccinated Americans To Wear Mask Over Indian Study Says Republican Leader Kevin Mccarthy-TeluguStop.com

బ్రెజిల్‌లో ఏం జరుగుతుందో రోజూ చూస్తూనే వున్నాం.తక్కువ ధరకు టీకాలు దొరుకుతుంటే.

భారత్‌లోని కొవాగ్జిన్‌ను అంత రేటు పెట్టి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ అక్కడి విపక్షాలు బొల్సోనారో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.అటు వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడిని దిగిపోవాల్సిందిగా కోరుతున్నాయి.

 Democrats Forcing Vaccinated Americans To Wear Mask Over Indian Study Says Republican Leader Kevin Mccarthy-అమెరికాలో మాస్కుల రాజకీయం.. భారత్‌ను ఎత్తిచూపుతూ బైడెన్ సర్కార్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేందుకు భారతదేశంలోనూ నరేంద్ర మోడీ సర్కార్ ఇదే ఇబ్బందిని ఎదుర్కోంటోంది.తొలి దశను కట్టుదిట్టంగా ఎదుర్కొని ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న ప్రధాని నరేంద్రమోడీ.సెకండ్ వేవ్‌లో మాత్రం ప్రజల అంచనాలను అందుకోలేకపోయారు.అంతేనా హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహణ, కేసులు పరుగుతున్న వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం వంటి అంశాలు బీజేపీ పెద్దలను ఇరుకునపెట్టాయి.

ఏది ఏమైనా కోట్లాది మంది భారతీయులు రెండో దశలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక మోడీ వ్యాక్సినేషన్ పాలసీపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

దేశ అవసరాలు పక్కనబెట్టి.టీకా దౌత్యం పేరిట ఉదారంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడంతో భారత్‌లో అవసరమైన సమయంలో టీకాల కొరత వేధించింది.

ఇవన్నీ ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చాయి.

ఇక అమెరికాలోనూ కరోనా రాజకీయ వేడిని రగిలిస్తోంది.

ఇప్పటికే అక్కడ వ్యాక్సిన్‌కు సపోర్ట్‌గా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ప్రతిరోజూ మాటల యుద్ధం చేసుకుంటున్నాయి.సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లో దేశంలో మళ్లీ మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు దుమారం రేపాయి.

డెమొక్రాట్స్ బలవంతంగా అమెరికన్ల చేత మాస్కులు ధరింపజేస్తున్నారని రిపబ్లికన్ నేత కేవిన్ మెకార్తీ మండిపడ్డారు.అమెరికాలో ఏమాత్రం ఆమోదం పొందని భారత్‌లోని ఓ కరోనా టీకా అధ్యాయనం ఆధారంగా ఇలా మాస్కులు ధరించమనడం ఎంతవరకు సమంజసమని కేవిన్ ప్రశ్నించారు.

అటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తీరును కూడా ఆయన తప్పుబట్టారు.ప్రతిసారీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ దేశ ప్రజలను శిక్షించడం తగదంటూ హితవు పలికారు.

గతంలో సీడీసీ మార్గదర్శకాలను తూచతప్పకుండా పాటించిన దేశ పౌరులను ఇప్పుడు మరోసారి అదే పని చేయమని చెప్పి గందరగోళంలో పడేస్తుందని కేవిన్ చెప్పారు.డెమొక్రాట్ల చేతిలో సీడీసీ కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు.

Telugu Biden, Center For Disease Control And Prevention, Democrats Forcing Vaccinated Americans To Wear Mask Over Indian Study Says Republican Leader Kevin Mccarthy, Republican Leader Kevin Mccarthy-Telugu NRI

కాగా, దాదాపు నెలన్నర రోజుల క్రితం అమెరికాలో మాస్కులు తప్పనిసరి కాదంటూ బైడెన్ ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.దాంతో దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.కానీ డెల్టా వేరియంట్ కారణంగా మళ్ళీ కోవిడ్ కేసులు పెరగడంతో ఈ తాజా నిబంధనలను ప్రవేశపెట్టారు.అమెరికా లో ఇంకా కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్నారు.ఈ మేరకు ప్రభుత్వం నిన్న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

పాతవాటిని సవరించింది.సుమారు 20 లక్షలమందికి పైగా ఫెడరల్ వర్కర్లు, ప్రజలు మాస్కులు ధరించాలని బైడెన్ సూచించారు.

రెండు డోసులూ వ్యాక్సిన్ తీసుకున్నా ఇది అనివార్యమని బైడెన్ పేర్కొన్నారు.ఈ ఆదేశాల నేపథ్యంలోనే కేవిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

#Biden #RepublicanKevin #Center Control

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు