ట్రంప్ రిసార్ట్‌లో వాయుసేన అధికారుల బస: డెమొక్రాట్ల చేతికి అస్త్రం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన టర్న్‌బెర్రీ రిసార్ట్స్ వద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థలు ల్యాండింగ్‌కు దిగిన ఘటన వివాదాస్పదం కావడంతో అమెరికా వాయుసేన సమీక్షకు ఆదేశించింది.అధ్యక్షునికి చెందిన వ్యక్తిగత ప్రదేశాలను ప్రభుత్వ పరమైన కార్యక్రమాలకు ఉపయోగించడం నైతికత అనిపించుకోదని వాయుసేన అభిప్రాయపడింది.

 Democrats Areprobing Trumps Finances And Businesses Over 2020 Elections Milatar-TeluguStop.com

కొద్దిరోజుల క్రితం యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌ కువైట్‌ వెళుతూ మార్గమధ్యంలో ఇంధనం నింపుకునేందుకు దిగింది.

ఆ సమయంలో సీ-17 క్రూ సిబ్బంది ట్రంప్ రిసార్ట్‌లో బస చేశారు.

ట్రంప్ కంపెనీలు డబ్బు సంపాదించేందుకు గాను ఎంచుకున్న మరో మార్గమంటూ కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు తప్పుబట్టాయి.ఇది అమెరికా రాజ్యాంగంలోని నైతిక సూత్రాలకు విరుద్ధమంటూ వాదించాయి.ఈ నేపథ్యంలోనే ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో పాటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ట్రంప్ రిసార్ట్స్‌లో బస చేయడంపై విచారణ జరపాల్సిందిగా ఎయిర్‌ మొబిలిటి కమాండ్‌ను అమెరికా వాయుసేన ఆదేశించింది.

ప్రాథమిక విచారణలో భాగంగా గ్లాస్గోవ్‌లోని ప్రెస్ట్‌విక్ విమానాశ్రయం మీదుగా నడిచే అంతర్జాతీయ సర్వీసుల విమానాలు ఇంధనం నింపుకునేందుకు అక్కడ ఆగుతాయని.

ఆ సమయంలో పక్కనేవున్న టర్న్‌బెర్రీ రిసార్ట్స్‌లో బస చేస్తారని తేలింది.ప్రెస్ట్‌విక్ విమానాశ్రయం మీదుగా వెళ్లేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను వాయుసేన రూపొందించింది.

Telugu Democrats, Telugu Nri Ups-

  అయితే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యున్నత అధికారులు మాత్రం విలాసవంతమైన బసను కోరుకుంటున్నారని.వీటిల్లో ధరలు ప్రభుత్వ పరిధిని దాటి ఉన్నాయని గుర్తించింది.సైనిక వ్యయం ఏ ఏటికి ఆ యేడు పెరిగిపోతోందని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిగ్గుతేల్చింది.ఇందులో ట్రంప్‌కు చెందిన టర్న్‌బెర్రీ రిసార్ట్స్‌లో వాయుసేన సిబ్బంది బస గురించి కూడా ప్రస్తావించింది.

ఈ క్రమంలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి ట్రంప్‌‌పై పైచేయి సాధించాలని డెమొక్రాట్లు వ్యూహాలు రచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube