ట్రంప్‌ను వదిలేది లేదంటున్న డెమొక్రాట్లు: అభిశంసనకు సాక్ష్యాల అన్వేషణ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తప్పించేందుకు డెమొక్రాట్లు ‘‘అభిశంసన’’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 Democrats Aim To Prove Donald Trumps Impeachment-TeluguStop.com

ఇందుకు సంబంధించి బుధవారం నుంచి ప్రజల ముందు విచారణ జరిపి.అధ్యక్షునికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించనున్నారు.

డెమొక్రాట్ పార్టీకి చెందిన జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఉక్రెయిన్ చమురు కంపెనీలో కీలకపదవిలో నియమితులయ్యారు.అయితే హంటర్ నియామకంపై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్ దేశాధినేత వొలొదిమిర్ జెలెన్‌స్కీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని.

ఒకవేళ జరిపించడానికి ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేస్తాయని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Telugu Warrant, Democrats, Donald Trump, Telugu Nri Ups-

ప్రస్తుతం హంటర్ తండ్రి జో బిడెన్ దేశాద్యక్ష పదవికి పోటీపడుతున్నారు.అందువల్లే ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారని డెమొక్రాట్లు వాదిస్తున్నారు.దేశద్రోహం, అవినీతి, లంచం, తీవ్ర నేరాలకు పాల్పడినప్పుడు మాత్రమే అధ్యక్షుడిని అభిశంసించవచ్చునని రాజ్యాంగం తెలుపుతోంది.

ట్రంప్ అధికార దుర్వినియోగం తీవ్ర నేరం కిందకు వస్తుందని డెమొక్రాట్లు వాదిస్తున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ట్రంప్ అభిశంసనపై బహిరంగ చర్చను ప్రారంభించనున్నారు.

కాగా.నవంబర్ 19, 1998లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తర్వాత అభిశంసనను ఎదుర్కొంటున్న మొదటి అధ్యక్షుడు ట్రంపే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube