అమెరికా అధ్యక్ష ఎన్నికలు: గెలిస్తే నా కంపెనీ అమ్మేస్తా.. బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్ పార్టీ నుంచి బరిలో నిలిచిన బిలియనీర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ సంచలన ప్రకటన చేశారు.నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఒకవేళ తాను గెలుపొందితే తన కంపెనీని విక్రయిస్తానంటూ ప్రకటించారు.

 Democratic Presidential Contender Michael Bloomberg To Sell His Firm If Elected-TeluguStop.com

ఆయన ముఖ్య సలహాదారు టిమ్ ఓబ్రెయిన్ మంగళవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

గతేడాది నవంబర్‌లో డెమొక్రాటిక్ నామినేషన్ రేసులో ప్రవేశించినప్పటి నుంచి బ్లూమ్‌బెర్గ్‌పై ఓపినియన్ పోల్స్‌లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో లాస్ వేగాస్‌లో బుధవారం ఎలక్షన్ సైకిల్ గురించి ఆయన చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధి కోసం జరుగుతున్న ముందస్తు పోల్స్‌లో ఒక్కసారిగా లీడ్‌లోకి వచ్చిన బ్లూమ్‌బెర్గ్ ప్రచారంలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తున్నారు.

తాజాగా తన సంస్థను అమ్మేస్తానని ప్రకటించడం ద్వారా తాను వ్యాపార కార్యకలాపాలను వదిలేసి పూర్తిగా ప్రజల కోసమే అంకితమవుతానని అమెరికన్లకు సంకేతాలు పంపేందుకే బ్లూమ్‌బెర్గ్ ఈ ప్రకటన చేసివుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Telugu Bloomberg, Democratic, Michael, Telugu Nri-Telugu NRI

1981లో బ్లూమ్‌బర్గ్ సంస్థను స్థాపించిన మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ అంచలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసి బిలియనీర్‌గా అవతరించారు.2019లో ఈ సంస్థ 10 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది.సంస్థను అమ్మే క్రమంలో బ్లూమ్‌బర్గ్ ఓ షరతు కూడా పెట్టారు.

విదేశీ వ్యక్తులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు తన కంపెనీని అమ్మే ప్రసక్తి లేదని ఆయన నిర్ణయించుకున్నారు.ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌లా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక వివాదాల్లో ఇరుక్కోకుండా ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టిమ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube