డెమొక్రాట్ అభ్యర్ధిగా నేను నామినేట్ అయితే.. మహిళకు ఉపాధ్యక్ష పదవి: జో బిడెన్ సంచలనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రైమరీలలో దూసుకెళ్తున్న జో బిడెన్ సంచలన ప్రకటన చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున తాను నామినేట్ అయితే గెలిచిన తర్వాత దేశ ఉపాధ్యక్ష పదవిలో మహిళను నియమిస్తానని బిడెన్ ప్రకటన చేశారు.

 Democratic Presidential Contender Joe Biden Says He Will Pick Woman To Be His V-TeluguStop.com

డెమొక్రాట్ ప్రైమరీలలో భాగంగా అతని ప్రత్యర్ధి శాండర్స్‌తో ఆదివారం జరిగిన చర్చా సందర్భంగా జో ఈ విధంగా వ్యాఖ్యానించారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నుకోబడితే తన క్యాబినెట్, తన పరిపాలనా విధానం దేశంలాగే ఉంటుందన్నారు.

వాస్తవానికి తాను ఒక మహిళను ఉపాధ్యక్షురాలిగా నియమించాలని భావిస్తున్నానని, దీనికి తాను కట్టుబడి ఉంటానని ఈ పదవికి అర్హత గల మహిళలు దేశంలో ఎందరో ఉన్నారని బిడెన్ చెప్పారు.

ఈ ఏడాది నవంబర్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేసేందుకు డెమొక్రాటిక్ నామినేషన్ కోసం ఆరుగురు మహిళలు బరిలో ఉన్నారు.

వీరిలో యూఎస్ సెనేటర్లు ఎలిజబెత్ వారెన్, అమీ క్లోబుచార్, కమలా హారిస్, కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్‌లతో పాటు యూఎస్ ప్రతినిధి సభ సభ్యులు తులసి గబ్బార్డ్, మరియాన్ విలియమ్సన్ ఉన్నారు.దేశవ్యాప్తంగా 5 శాతం కంటే తక్కువ పోలింగ్‌ను నమోదు చేసినప్పటికీ, చర్చలో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ, మహిళల్లో తులసీ గబ్బార్డ్ ఒక్కరే రేసులో మిగిలారు.

మరోవైపు శాండర్స్ మాట్లాడుతూ.అన్నిటిలోనూ అతను ఒక స్త్రీని సహచరుడిగా కోరుకుంటారని, కానీ అది ఆచరణలో చేసి చూపించరని ఆరోపించారు.కాగా అమెరికా చరిత్రలో రెండు సార్లు మహిళలను ఉపాధ్యక్ష పదవి కోసం నామినేట్ చేశారు.అయితే ఆ రెండు పర్యాయాలు వారు ఓడిపోయారు.1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ పార్టీ నుంచి సారా పాలిన్‌లను ప్రధాన పార్టీలు ఉపాధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించాయి.ఇకపోతే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష బరిలో ఏకంగా మహిళనే రంగంలోకి దించింది.2016లో హిల్లరీ క్లింటన్‌‌ను ట్రంప్‌పై పోటీకి నిలబెట్టింది.అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube