అధ్యక్షుడిగా గెలిస్తే... హెచ్ 1 బీ వీసాలపై నిషేధం ఎత్తేస్తా: భారతీయులే లక్ష్యంగా జో బిడెన్ హామీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ భారతీయులకు బంపరాఫర్ ఇచ్చారు.తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే.

 Democratic Presidential Candidate Joe Biden Says He Will Revoke H-1b Visa Suspen-TeluguStop.com

హెచ్ 1 బీ వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు.ఓ వార్తా సంస్థ నిర్వహించిన సమావేశంలో జో బిడెన్ మాట్లాడుతూ… కంపెనీ వీసా మీద అమెరికాకు వచ్చిన వారు దేశ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.

ఈ దేశం కోసం పాటుపడుతూ… లెక్కలోకిరానీ 11 మిలియన్ల వలసదారుల పౌరసత్వానికి సంబంధించి రోడ్ మ్యాప్ కోసం ఒకరోజు ‘‘ లెజిస్లేటివ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్’’ బిల్లును కాంగ్రెస్‌కు పంపుతానని బిడెన్ చెప్పారు.ప్రస్తుతం వున్న ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఆధునికీకరిస్తామని.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 100 రోజుల కార్యాచరణను వివరించారు.అంతేకాకుండా గ్రీన్‌కార్డులు, డ్రీమర్లకు సంబంధించిన అంశాలపై తన పాలనలో తగిన నిర్ణయాలు తీసుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.

Telugu Democratic, Indians, Joe Biden, Visa-Telugu NRI

కాగా, అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాల జారీపై డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది చివరి వరకు వీటిని రద్దు చేస్తూ వైట్ హౌస్‌ ఉత్తర్వులు జారీ చేసింది.అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటిచ్చేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.దీని కారణంగా విదేశీయులు ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడుతుంది.

వీరు వీసా స్టాంపింగ్ కోసం సంవత్సరం చివరి వరకు వేచి వుండాల్సి వస్తోంది.అంతేకాకుండా అక్కడి.

భారతీయ, అమెరికన్ కంపెనీలలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న భారతీయుల వీసా పునరుద్దరణ కూడా ఆలస్యం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube