ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బెర్నీ శాండర్స్

హృదయ సంబంధిత అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్ధి బెర్నీ శాండర్స్ డిశ్చార్జ్ అయ్యారు.శుక్రవారం సాయంత్రం నేవాడా ఆసుపత్రి వైద్యులు ఆయనను ఇంటికి పంపించినట్లు ప్రకటించారు.78 ఏళ్ల బెర్నీ శాండార్స్ ఈ వారం ప్రారంభంలో అస్వస్థతకు గురైన ఆయనను డిసెర్ట్ స్ప్రింగ్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.

 Democratic Presidential Candidate Bernie Sanders Was Discharged Fromhospital-TeluguStop.com

అక్కడి భారత సంతతి-అమెరికా వైద్యుడు డాక్టర్ అర్జున్ గురురాజ్ పరీక్షించి మయోకార్డియల్ ఇన్ఫార్క్సన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు.

సెనేటర్ శాండర్స్‌ ధమనుల్లో ఏర్పడిన అడ్డంకిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు ఆయన ప్రచార బృందం ప్రకటించింది.ఈ నేపథ్యంలో శాండర్స్ పాల్గొనాల్సిన అన్ని రకాల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Telugu American, Bernie Sanders, Telugu Nri Ups-

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత శాండర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.డిసెర్ట్ స్ప్రింగ్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ వైద్యులు, నర్సులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రిలో ఉన్న రెండున్నర రోజుల సమయంలో తనను కంటికి రెప్పలా చూసుకున్నారని శాండర్స్ కొనియాడారు.స్వల్ప విశ్రాంతి అనంతరం మళ్లీ తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు.

అలాగే తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులు, పార్టీ మద్ధతుదారులకు శాండర్స్ కృతజ్ఞతలు తెలిపారు.తాను బాగానే ఉన్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube