కమలా హారిస్ నోటి వెంట ‘‘ చిత్తి ’’ అన్న మాట: సంబరాల్లో తమిళులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్ అధికారికంగా అభ్యర్ధిత్వాన్ని స్వీకరించారు.డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌ల సమక్షంలో కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నామినేట్ అయ్యారు.

 Kamala Harris Mentions Her 'chithis' During Speech, Kamala Harris , Chithis, Pre-TeluguStop.com

అనంతరం సదస్సును ఉద్దేశిస్తూ ఆమె ప్రసంగించారు.మన విషాదాలను, బాధలను రాజకీయ ఆయుధాలుగా మలచుకున్న ట్రంప్‌ను ఓడించాలని కమల పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో జో బిడెన్‌ను గెలిపించాలని ఆమె కోరారు.బిడెన్ దేశాధ్యక్షుడైతే, దేశ ప్రజలందరినీ ఆయన ఒక్క తాటిపైకి తీసుకొస్తారని కమలా ఆశాభావం వ్యక్తం చేశారు.ట్రంప్ నాయకత్వ వైఫల్యం.ప్రజల ప్రాణాలను, జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిందని ఆమె మండిపడ్డారు.

ఇదే సమయంలో ‘‘ చిత్తి ’’ అన్న తమిళ పదాన్ని కమల ఉచ్చరించారు.తమిళంలో చిత్తి అంటే చిన్నమ్మ అని అర్థం.

ఆమె నోటి వెంట ఈ మాట రాగానే తమిళులు హర్షం వ్యక్తం చేశారు.ఇక తమిళులు కాని వారు గూగుల్‌లో ఆ పదం కోసం బాగా సెర్చ్ చేస్తున్నారు.

కమలా హారిస్ నోటి వెంట ‘‘ చిత్త

కాగా కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాల్‌ది తమిళనాడులోని చెన్నై.అనంతరకాలంలో శ్యామల అమెరికా వెళ్లి అక్కడ జమైకా దేశస్థుడిని పెళ్లి చేసుకున్నారు.శ్యామలా గోపాలన్ సోదరి అంటే కమలా హారిస్ పిన్ని తమిళనాడులోనే నివసిస్తున్నారు.డెమొక్రాటిక్ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత తన తల్లితో దిగిన ఫోటోలను కమలా హారిస్ ట్వీట్ చేశారు.

సోదరి మాయతో పాటు తనలోనూ కుటుంబ విలువల పట్ల తల్లి శ్యామల అనేక అంశాలను నూరిపోసినట్లు ఆమె చెప్పారు.మనం పుట్టిన ఇంటిని, మనం ఎంపిక చేసుకున్న కుటుంబంతో పాటు ఇతర ప్రపంచాన్ని కూడా సమదృష్టితో చూడాలని తన తల్లి తమకు నేర్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube