వాయిదా పడ్డ అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎంపిక..!!!

అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఒకపక్క కారోనా వైరస్ కారణంగా విలవిలలాడిపోతూ ఉంటే మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకు రావడంతో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆగస్టు 17 కు వాయిదా వేయాలని డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ తెలిపింది.

 Democratic Party, Joe Biden, America, Elections, Nri News-TeluguStop.com

అయితే ఇదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ కంటే వారం రోజులు ముందుగానే అధికార రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించనుందిని తెలుస్తోంది.
వాస్తవానికి జూన్ 13న మిల్వాకీ లో జరగాల్సిన ఈ ఎంపిక ప్రక్రియ కరోనా వైరస్ కారణంగా రీ షెడ్యూల్ చేశారు.

డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి అభ్యర్థి బరిలో ఉన్న జో బిడెన్ బెర్నీ సాండర్స్ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఈ అంశంపై ఇటీవల కాలంలో పార్టీ నేతలు ప్రచార శిబిరాల మధ్య చర్చలు సాగించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ చర్చల ప్రక్రియ అనంతరం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది….ఇదిలా ఉంటే

Telugu America, Democratic, Joe Biden, Nri-

ఈ వాయిదా నిర్ణయం డెమోక్రటిక్ నేషనల్ పార్టీ కి ఇష్టం లేకపోయినా ఈ ప్రక్రియను జాప్యం చేయాలంటూ జో బిడెన్ ఇటీవల కాలంలో చేసిన విజ్ఞప్తి మేరకే కమిటీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పతనావస్థ లో ఉన్న కారణంగా ఈ సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని తాము అనుకోవడం లేదని నేషనల్ కమిటీ తెలిపింది.పార్టీ లోని సభ్యులకి, దేశ పజలకి ఇష్టమయ్యే రీతిలోనే తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube