ఊహించని మద్ధతు: జో బిడెన్‌‌కు జై కొట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్  

Democratic Front Runner Joe Biden Wins The Endorsement Of The National Education Association - Telugu Arizona States, Biden,, Democratic Primary Elections, Florida, Illinayis, Ohiyo, Unioun Hillari Clinton

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాటిక్ ప్రైమరీలో జో బిడెన్ దూసుకెళ్తున్నారు.తాజాగా దేశంలోని అతిపెద్ద కార్మిక సమూహమైన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌ మద్ధతు పలికింది.

 Democratic Front Runner Joe Biden Wins The Endorsement Of The National Education Association

కాలేజీ విద్యార్ధినులతోపాటు విద్యావంతులైన మహిళలు సభ్యులుగా ఈ అసోసియేషన్ డెమొక్రాటిక్ ప్రైమరీలో కీలకమైనదిగా చెబుతారు.డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భాగంగా ఒహియో, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, అరిజోనా రాష్ట్రాల్లో బిడెన్‌కు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని అసోసియేషన్ స్పష్టం చేసింది.

ఆయా రాష్ట్రాల్లో దీనికి వేలాదిమంది సభ్యులు ఉన్నారు.ప్రభుత్వ విద్య కోసం బిడెన్ అలసిపోని పోరాటం చేస్తున్నారని.విద్యార్ధులకు, విద్యావేత్తలకు ఆయన వైట్‌హౌస్‌లో అవసరమయ్యే భాగస్వామిగా యూనియన్ అధ్యక్షుడు లిల్లీ ఎస్కెల్సెన్ గార్సియా అభివర్ణించారు.ప్రతి జెడ్‌ఐపీ కోడ్‌లోని ప్రతి విద్యార్ధికి ప్రభుత్వ పాఠశాలను అందించడం మన నైతిక బాధ్యతని బిడెన్ అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఊహించని మద్ధతు: జో బిడెన్‌‌కు జై కొట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో విద్యావేత్తలను జో బిడెన్‌ను వైట్‌హౌస్‌కు పంపేందుకు విద్యావేత్తలు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని గార్సియా చెప్పారు.

2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శాండర్స్ పై పోటీ సమయంలో ఇదే యూనియన్ హిల్లరీ క్లింటన్‌కు మద్ధతు ఇచ్చింది.ఇది ఇప్పటి వరకు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధిని ఎప్పుడూ సమర్ధించలేదు.అప్పట్లో యూనియన్ నాయకత్వంలో ఓడిపోయినప్పటికీ, కొన్ని యూనియన్లలోని ర్యాంక్ అండ్ ఫైల్ సభ్యుల నుంచి శాండర్స్ మద్ధతు పొందగలిగాడు.

ఉదాహరణకు నెవాడాలోని ఒక కార్మికుల యూనియన్ అతని హెల్త్‌కేర్ ప్లాన్‌‌కు ఆకర్షితులై మద్ధతు పలికారు.యూనియన్ సభ్యుల మద్ధతుతో శాండర్స్ రాష్ట్ర కాకస్‌లను గెలుచుకున్నాడు.

కాగా ఉపాధ్యాయ సంఘం యొక్క మద్ధతును కూడా బిడెన్ పొందగలిగారు, పరేడ్‌ల సందర్భంగా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్‌ అయితే బిడెన్‌కు ఆరంభం నుంచి మద్ధతుగా నిలిచారు.వీరితో పాటు ఇంటర్నేషనల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్కర్స్, అమల్గామేటెడ్ ట్రాన్సిట్ యూనియన్ కూడా ఆయనకు మద్ధతునిచ్చాయి.దేశంలోని రెండో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ … బిడెన్, శాండర్స్, ఎలిజబెత్ వారెన్‌లలో ఎవరో ఒకరికి మద్ధతు ఇవ్వాల్సిందిగా గత నెలలో తన సభ్యులను కోరింది.

ప్రచారం సందర్భంగా జో బిడెన్ విద్యను తన ఎజెండాలోని ప్రధానమైనదిగా పేర్కొన్నారు.అంతేకాకుండా తన భార్య జిల్.కమ్యూనిటీ కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోందని తెలపడంతో పాటు ఎన్ఈఏ సభ్యురాలు అని పదే పేదే చెప్పేవాడు.అయోవా, పెన్సిల్వేనియా, టెక్సాస్‌లతో సహా యూనియన్ అధ్యక్ష ఫోరమ్‌లలో మూడింటికి బిడెన్ హాజరయ్యారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Democratic Front Runner Joe Biden Wins The Endorsement Of The National Education Association Related Telugu News,Photos/Pics,Images..

footer-test