బాలయ్యా మజాకా... అఖండ కోసం బీ టౌన్ పీపుల్స్ డిమాండ్.. ఏమిటంటే?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 Demands On Social Media For Balakrishna Akhanda Movie Hindi Version Akhanda Movi-TeluguStop.com

బాలకృష్ణ క్రేజ్ అంటే ఇది అనిపించేలా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.సాధారణంగా పాన్ ఇండియా సినిమా తీయడం వేరు.

సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా క్రేజ్ రావడం వేరు.ఈ రెండింటికీ ఉన్న తేడా సదరు సినిమా ఏంటి అనేది స్పష్టం చేస్తుంది.

బాలకృష్ణ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.

ఇకపోతే ఇది ఇలా ఉంటే అఖండ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిందీ వెర్షన్ కావాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.అఖండ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలి అంటూ నార్త్ ఇండియన్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు.

అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్ ధర్మ అంటూ హిందీ వెర్షన్ మూవీ కోరుతున్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో #WeWantAKHANDAInHindi అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ చేస్తున్నారు.

అఖండ సినిమాకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేస్తూ తమ డిమాండ్స్ పోస్ట్ చేస్తున్నారు.అఖండ సినిమా విడుదల అయి 50 రోజులు పూర్తయిన తర్వాత కూడా అఖండ మూవీ ట్రెండ్ అవుతుండటం విశేషం.ఇక తాజాగా జనవరి 21న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ స్టార్ట్ కాగా తొలి 24 గంటల్లో 10 లక్షల స్ట్రీమింగ్ సాధించి డిజిటల్ రంగంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇక ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా త్వరలోనే యూట్యూబ్ లో అఖండ సినిమా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube