జనసేన అభ్యర్థులకు అప్పుడే డిమాండ్ పెరిగిపోయిందా ?  

Demand Has Been Increased For Janasena Candidates-

ఆలూ లేదు సులూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేసేలా ఇప్పుడు ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉంది.ఫలితాలు వస్తే కానీ ఏ పార్టీ ముందంజలో ఉంది ఏ పార్టీ వెనుకబడింది అనే విషయంలో క్లారిటీ రాదు.

Demand Has Been Increased For Janasena Candidates--Demand Has Been Increased For Janasena Candidates-

కానీ రసవత్తర పోటీలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటి ? అప్పుడు చిన్నా చితక పార్టీల మద్దతు తప్పనిసరి, వారే కాదు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కీలకం అవుతారు.అందుకో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు రంగంలోకి దిగిపోయి వారందరితో అప్పుడే బేరసారాలు ఆడుతున్నాయి.

Demand Has Been Increased For Janasena Candidates--Demand Has Been Increased For Janasena Candidates-

ఈ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.సుమారు యాభై నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీలు జరిగాయి.దీంతో ఈ సారి మూడు పార్టీలకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టీడీపీ, వైసీపీలతో పాటు.జనసేనకూ కొన్ని సీట్లు వస్తాయని సర్వేలు తేల్చేయడంతో జనసేన మీద రెండు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి.టీడీపీ, వైసీపీ పార్టీల అంచనా ప్రకారం జనసేన పార్టీకి ఐదు నుంచి పది వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలడంతో గెలిచే అవకాశం ఉందన్న జనసేన పార్టీ అభ్యర్థులను బుట్టలో వేసుకునే పనిలో పడ్డాయి.

రేసులో విజయావకాశాలు ఉన్న జనసేన అభ్యర్థుల జాబితాలను బయటకు ఇప్పటికే టిక్ పెట్టుకున్నాయి రెండు పార్టీలు.జనసేనకు ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మాత్రమే గెలుపు గుర్రాలు ఉన్నాయి.

వీరిలో ఎవరైతే గట్టిగా ప్రయత్నించారో వారి కోసం టీడీపీ, వైసీపీ నేతలు స్కెచ్ లేయడం స్టార్ట్ చేసేశాయి.

ఎన్నికల ముందు టికెట్ దక్కలేదు అన్న కారణంతో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు జనసేన లో చేరి సీటు సంపాదించుకున్నాడు.అతడి విజయం కోసం పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే ప్రయత్నం చేసాడు.దీంతో అతడు గెలిచే అవకాశం ఉన్నట్టు అనేక సర్వేల్లో తేలడంతో టీడీపీ నేతలు పాత పరిచయాలతో అతన్ని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లాలో జనసేన తరపున బరిలో ఉన్న వారిలో బలమైన అభ్యర్థులుగా ఉన్న వారిలో ఎక్కువమంది వైసీపీ నేతలే.వైసీపీలో టిక్కెట్లు దొరకకపోవడంతో వారంతా జనసేనలో చేరిపోయారు.వారందరిని వైసీపీలోకి లాగేందుకు పార్టీ నాయకులు రంగంలోకి దిగిపోయారు.చివరి క్షణంలో జగన్ టికెట్ నిరాకరించడంతో జనసేనలో చేరిన మరోనేత, అందరి కంటే ముందుగానే టిక్కెట్ ఖరారు చేసుకున్న మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలడంతో వారిని వైసీపీ నాయకులు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓ ఇద్దరు అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో రెండు పార్టీలు నిమగ్నం అయ్యాయి.వారికి పదవి, డబ్బు రెండూ ఆఫర్ చేస్తూ తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.