ఆ దేశంలో ల‌భించే క‌ల్లుకు య‌మ గిరాకీ.. క‌థేంటంటే..!

కల్లు అనే పేరు వినగానే ఆనంద పడేవారిని మనం గ్రామీణ ప్రాంతాల్లో చూడొచ్చు.రసాయనాలతో చేసిన ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండే లిక్కర్ కంటే కల్లు తాగడం మంచిదేనని పెద్దలు చెప్తుంటారు.

 Demand For This Specialty Has Grown Significantly As A Result Of Recent Corporat-TeluguStop.com

అయితే, కల్లులోనూ కల్తీ చేసే వారు ఉన్నప్పటికీ కల్తీ లేని కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది.మనుషుల్లో మూత్రపిండాల్లోని రాళ్లను తొలగిస్తుంది కల్లు.

ఇక పోతే ఈత, తాటి కల్లు గురంచి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, కొబ్బరి కల్లు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంతకీ కొబ్బరి కల్లు ఎక్కడ లభిస్తుంది? దాని ఉపయోగాలంటి? తదితర విషయాలకై ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.

శ్రీలంకలో కొబ్బరి చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు.అదే కొబ్బరి కల్లు.ఈ కల్లు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారింది.దాంతో దీని అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తున్నది.

ఈ కోకొనట్ కల్లుకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది.డిఫరెంట్ టేస్ట్ ప్లస్ ఫ్లేవర్ ఉండే ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ అని పిలుస్తారు.

ఈ కొబ్బరి కల్లు శ్రీలంకలో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ బాగా పాపులర్ అయింది.కంపెనీలు కొబ్బరి చెట్ల నుంచి కల్లును తీసి ఆకర్షణీయమైన సీసాల్లో వీటని ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

Telugu Liquer, Srilanka-Latest News - Telugu

ఈ కొబ్బరి కల్లులోని ఆయుర్వేద గుణాల వల్ల హెల్త్‌కు మంచి జరుగుతుందని శ్రీలంక దేశవాసులు మాత్రమే కాదు విదేశీయులూ నమ్ముతున్నారు.ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికల్లుకు సెపరేట్ అభిమానులు ఉన్నారు.

ఏటా 60 మిలియన్ టన్నుల లీటర్ల కొబ్బరి

కల్లును కంపెనీలు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నాయి.అయితే, చెట్టు నుంచి తీసిన వెంటనే తాగితే ఈ కొబ్బరి కల్లు తియ్యగా ఉంటుంది.

లేట్ అవుతున్న కొద్దీ టేస్ట్, ఫ్లేవర్ మారుతుంది. చెట్టు నుంచి తీసిన ఆరు గంటల తర్వాత కొబ్బరి కల్లు తాగితే ఉప్పుగా ఉంటుంది.

ఈ కొబ్బరి కల్లు ప్రస్తుతానికి శ్రీలంకతో పాటు జపాన్ వంటి ఇతర దేశాల్లో అవెయిలెబుల్‌గా ఉంది.కాగా, త్వరలో భారతీయ మార్కెట్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube