విజృంభిస్తున్న డెల్టా వేరియంట్.. టోక్యోలో ఎమర్జెన్సీ..!

జపాన్ రాజధాని టోక్యోలో డల్టా వేరియంట్ కేసులు ఎక్కువవుతున్నాయి.ఈ క్రమంలో అక్కడ జరగాల్సిన ఒలింపిక్స్ పై మరింత కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

 Delta Variant Spreading Emergency In Tokyo City, Delta Variant, Emergency, Olymp-TeluguStop.com

ఈ నెల 23 నుండి టోక్యోలో ఒలింపిక్స్ జరుగనున్నాయి.అయితే అక్కడ డెల్టా వేరియంట్ కేసులు అధికమవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.

అందుకే జపాన్ ప్రభుత్వం టోక్యోని ఎమర్జెన్సీని విధించింది.ఆగష్టు 22 వరకు అమర్జెన్సీ అమలు ఉంటుందని ప్రకటించింది.

జూలై 23న మొదలవుతున్న ఒలింపిక్స్ ఆగ్ష్టు 8 వరకు జరుగనున్నాయి.ఒలింపిక్స్ జరిగే అన్ని రోజులు టోక్యో ఎమర్జెన్సీలో ఉంటుంది.

ఇక కేసులు పెరుగుతున్న తరుణంలో ఖాళీ స్టేడియం లోనే క్రీడలు ఆడించనున్నారు.అంతకుముందు 10 వేల మంది స్థానికులకు అవకాశం కల్పిస్తారని ప్రకటించారు కాని కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ సింటమ్స్ కనబడటం ఆందోళనకు గురి చేస్తుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరుగుతుంది.టోక్యో ఒలింపిక్స్ జరిగే టైం లో టోక్యో మొత్తం ఎమర్జెన్సీ నీడలో ఉంటుందని తెలుస్తుంది. క్రీడాకారుల్లో కూడా ఈ వేరియంట్ ఓ భయాన్ని కలిగిస్తుంది.

ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడేందుకు వారు కృషి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube