ఒక్క రోజులో ఇన్ని కేసులా....అమెరికాలో డెల్టా టెర్రర్..ఆందోళనలో బిడెన్...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వేరియంట్ డెల్టా దడ పుట్టిస్తోంది.గడిచిన సంవత్సరం కరోనా మొదటి వేవ్ ధాటికి వణికిపోయిన అమెరికా ఇప్పుడు థర్డ్ వేరియంట్ దెబ్బకు అల్లాడి పోతోంది.

 Delta Variant Cases Deaths America-TeluguStop.com

గడిచిన కొన్ని రోజులుగా పరిశీలిస్తే వేలాది కేసులు నమోదు కాగా కేవలం నిన్న ఒక్క రోజులోనే లక్షన్నర కేసులు నమోదు అవడంతో మళ్ళీ అమెరికాలో కరోనా ఎలాంటి అలజడి సృష్టించనుందో నని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో దాదాపు అన్ని కేసులు డెల్టా వేరియంట్ కేసులేనని తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో దాదాపు అమెరికా నుంచీ అధ్యదికంగా డెల్టా కేసులు నమోదు అవుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది…ఇదిలాఉంటే

 Delta Variant Cases Deaths America-ఒక్క రోజులో ఇన్ని కేసులా….అమెరికాలో డెల్టా టెర్రర్..ఆందోళనలో బిడెన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో ముఖ్యంగా కరోనా కేసులు ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల నుంచీ నమోదు అవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమెరికాలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే ప్రధమం.

దాంతో బిడెన్ డెల్టా కేసుల విషయంలో ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ముందు నుంచీ డెల్టా వేవ్ ఉదృతిపై బిడెన్ కు సమాచారం ఉందని అందుకే ప్రజలను వ్యాక్సిన్ వేసుకోవాలంటూ అప్రమత్తం చేశారని కానీ ప్రజల నిర్లక్ష్యం కారణంగానే నేడు అమెరికాలో డెల్టా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

అమెరికా వ్యాప్తంగా వస్తున్న మొత్తం కేసుల్లో కేవలం ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల నుంచీ అత్యధికంగా వస్తున్నాయని చెప్పిన బిడెన్ సదరు రాష్ట్రాల గవర్నర్ లపై తీవ్రంగా మండిపడ్డారు.చేత కాకపొతే దిగిపోండి అంటూ ఫైర్ అయ్యారు. కరోనా నిభందనలు గాలికి వదిలేసి మాస్క్ లో లేకపోయినా, భౌతిక దూరం లేకపోయినా పరవాలేదంటూ అక్కడి ప్రభుత్వాలు నిభందనలు సడలించడం కారణంగానే కేసుల సంఖ్య పెరిగిపోయిందని మండిపడ్డారు.ఇదిలాఉంటే అమెరికాలో కేవలం నిన్న ఒక్క రోజులోనే 700 కు పైగా మృతుల సంఖ్య నమోదు అవగా 1.50 లక్షల కేసులు నమోదు అయ్యాయి దాంతో అమెరికా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్లు ఉండగా మృతుల సంఖ్య 6 లక్షలకు చేరింది.

.

#Covid #COVID Rules #DeltaVariant #Joe Biden #Delta Variant

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు