అగ్ర రాజ్యంలో డెల్టా కలవరం..పిల్లలపై తీవ్ర ప్రభావం..ఒక్క రోజులో...

అమెరికాలో డెల్టా వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది.రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడంతో స్థానిక ప్రభుత్వాలకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

 Delta Unrest In The Top Kingdom Severe Impact On Children In One Day ,  America,-TeluguStop.com

ఒక పక్క ప్రభుత్వం వ్యాకినేషణ్ వేస్తుంటే మరో పక్క డెల్టా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.అమెరికా వ్యాప్తంగా 50 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారని, ఇంకా 50 శాతం మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది.

అయితే వ్యాక్సిన్ పై ఉన్న అపోహల కారణంగా ఎంతో మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.ప్రస్తుతం డెల్టా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మెజారిటీ కేసులు కేవలం వ్యాక్సిన్ వేసుకొని వారివే నమోదు అవుతున్నాయని అంటున్నారు వైద్యులు.

దాంతో పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇదిలాఉంటే అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు 240 శాతం పెరిగినట్టుగా సర్వేలు చెప్తున్నాయి.

పరిశీలకులు చెప్పినట్టుగానే డెల్టా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఆసుపత్రులలో చేరుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ సమాచారం మేరకు గడిచిన వారం రోజులో దాదాపు 94 వేల మంది పిల్లలకు కరోనా సోకినట్టుగా ప్రకటించింది అంటే రోజుకు దాదాపు 13 వేల మందికి పైగానే డెల్టా వైరస్ బారిన పడుతున్నారట.

ఈ నివేదికతో అమెరికాలోని పిల్లల తల్లి తండ్రులలో ఆందోళన మొదలయ్యింది.కరోనా సోకిన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారట.

శ్వాస అందక పోవడంతో, వారు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే వైద్య సిబ్బంది తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారట.గడిచిన రెండు నెలల కాలంలో సుమారు 81 మంది కరోనాతో మృతి చెందినట్టుగా నివేదికలు చెప్తున్నాయి.

ముఖ్యంగా పాటశాలలకు వెళ్ళే పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందట.ఈ పరిస్థితులని పరిశీలించిన బిడెన్ 12 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సిన్ లు వేయడంపై నివేదిక తయారు చేయాలని డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ను ఆదేశించారట.

ఏది ఏమైనా పిల్లలను రెండు నెలల పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు తల్లి తండ్రులకు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube