అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ ఎక్కడ మొదటి వేవ్ ఉదృతి చూడాల్సి వస్తుందోనని అమెరికా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.మరో పక్క అమెరికా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈక్రమంలోనే కేవలం ఒక్క రోజులో 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.కొన్ని రోజుల క్రితం వరకూ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షలో నమోదవగా తాజాగా ఈ మార్క్ రెండు లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు పరిశీలకులు.
తాజా లెక్కల ప్రకారం గడిచిన వారం రోజుల్లో కరోనా కేసులు సగటున 1.33 లక్షలు నమోదయ్యాయని నెలరోజుల క్రితం వరకూ కూడా ఈ సంఖ్య కేవలం వేలల్లో ఉండేదని కానీ ప్రస్తుతం కరోనా కేసులు 286 శాతానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది.అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 145 శాతం పెరిగాయని అంటున్నారు నిపుణులు.అమెరికాలో ఆర్కాన్సాస్, వెర్మాంట్ మరొక రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాలు మినహ మిగిలిన రాష్ట్రాలలో కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉందని ముఖ్యంగా.
ఫ్లోరిడా, లూసియానాలలో కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక్కడ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయని వైద్యులు ప్రభుత్వాలకు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారట.
టెక్సాస్ లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా మారిందట.ఇంకొక విషయం ఏంటంటే.
టెక్సాస్ లో కేసుల నేపధ్యంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో మృతి చెందిన వారిని తీసుకువెళ్ళే ప్రత్యేకమైన మార్చురీ ట్రైలర్స్ పంపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారట.దీన్ని బట్టి అమెరికాలో కరోనా పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు.
అలాగే అమెరికా మీడియా ప్రస్తుతం అమెరికాలో ఉన్న వస్తావ పరిస్థితులను వెల్లడించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
.