బిర్యానీ అనగానే మనకు నోటిలో లాలాజలం ఉరిపోతూ ఉంటుంది.ఇక ఈ కాలపు యువత అయితే బిర్యానీని చాలా ఇష్టంగా తింటుంటారు.
బావర్చి బిర్యానీ, పారడైజ్ బిర్యానీ అని ఇక్కడ ఫేమస్ బిర్యానీ చాలానే వున్నాయి.మనలో చాలామంది వారానికి ఓ సారైనా బిర్యాని తింటూ వుంటారు.
వీకెండ్స్ వస్తే ఫామిలీతో సరదాగా అలా బయటకు వెళ్లి ఒక సినిమా చూసి బిర్యానీని తింటూ వుంటారు.హోటల్లో గాని లేదా రెస్టారెంట్ లో గాని బిర్యాని( Biryan) ధర సుమారు రూ.150 పైనే ఉంటుంది.ఇంకా రుచిని బట్టి కొన్ని చోట్ల ఇంకాస్త ఎక్కువ ధరలు ఉంటాయి.
అలాంటి బిర్యానీని రూ.59 లకే అమ్మితే ఎలాగుంటుంది? ఆ బిర్యానీ రుచికరంగా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఎగబడిపోరూ? ఇక్కడ కూడా అదే జరిగింది.విషయంలోకి వెళితే ఓ హోటల్ నిర్వాహకులు రూ.59 కే బిర్యాని అందిస్తున్నారు.ఇది మరెక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే.కాకా 55 అనే బిర్యాని పాయింట్( KAKA 55 BIRYANI ) లో రూ.59 కే చికిన్ దమ్ బిర్యాని వస్తోంది.అంతేగాక ఇక్కడ ఫ్రై బిర్యాని కేవలం రూ.70 కే దొరకడం విశేషం.
కాగా వీరికి హైదరాబాద్( Hyderabad ) లో 3 బ్రాంచ్ లు ఉన్నట్టు తెలుస్తోంది.ఎక్కడెక్కడంటే… నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్ పల్లి సెంకడ్ ఫేజ్, మూడో ఫేజ్ వద్ద మరో రెండు బ్రాంచులు ఉన్నట్టు తెలుస్తోంది.ఒక్కో హోటల్ వద్ద రోజుకు వీరు 250 నుండు 500 ప్లేట్స్ వరకు అమ్ముతున్నారు.
అలాగే ఆర్డర్లపై కూడా బిర్యానీ తయారు చేసి అందిస్తున్నారు.ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే బిర్యానీ ఆర్డర్ సమయానికి మనముందు ఉంచుతారు.