ఢిల్లీలో ఇంతే : ఓర్నీ గాలిని కూడా అమ్మేస్తున్నారా ?  

Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-inhale Oxygen

ఒకప్పుడు మంచినీళ్లు కొనుక్కోవడం అందరూ వింతగా విడ్డూరంగా చెప్పుకునేవారు.కలికాలం అంటే ఇదే అంటూ నిట్టూర్చేవారు.ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెల దాకా అందరూ మంచి నీటిని కొనుక్కుని తాగడం అంతా అలవాటు చేసేసుకున్నారు.అయితే ఇప్పుడు గాలిని కూడా అమ్మేందుకు ఓ స్టాల్ తెరుచుకోవడం సంచలనం రేపుతోంది.ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా తయారవడంతో నిర్వాహకులు ఈ సరికొత్త ఐడియా కు రూపకల్పన చేశారు.

Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-inhale Oxygen Telugu Viral News Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-inhale-Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-Inhale

ఢిల్లీ కాలుష్యం గురించి సుప్రీంకోర్టు కూడా ఆందోళన చెందుతోంది.దీనిపై ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను పిలిచి కాలుష్యం నివారణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.

Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-inhale Oxygen Telugu Viral News Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-inhale-Delhi’s Oxygen Bar Offers Pure Air In 7 Flavours-Inhale

ప్రస్తుతం శీతాకాలం మొదలవడంతో గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోయింది.ఈ నేపథ్యంలో సిటీ మాల్ సాకేత్ ప్యూర్ ఆక్సిజన్ అనే పేరిట కొన్ని స్టాల్ల్స్ ను ఏర్పాటు చేశారు.అక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ ను వివిధ ఫ్లేవర్స్ మిక్స్ చేసి అమ్మకానికి పెట్టారు.అయితే ఇదంతా ఉచితంగా కాదండోయ్ పావు గంటకు 299 రూపాయలు చెల్లించాలి.ఇది ఇది మరీ విడ్డూరం అనుకోకండి త్వరలోనే అన్ని అన్ని పట్టణాల్లోనూ ఈ విధమైన స్టాల్ల్స్ ఏర్పాటు చేసేందుకు సదరు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.